Video: బౌండరీ కొట్టలేదు.. పరుగులు తీయలేదు.. లంక తప్పిదంతో నెదర్లాండ్స్ ఖాతాలో 5 పరుగులు.. ఎలాగంటే?

Netherlands vs Sri Lanka, 19th Match: ఈ మ్యాచ్‌లో ముందుగా ఆడిన డచ్ జట్టుకు ఆరంభం చాలా దారుణంగా ఉంది. ఒక దశలో 91 పరుగుల వద్ద తమ ఆరుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ల వికెట్లను కోల్పోయింది. ఇక్కడి నుంచి ఎంగిల్‌బ్రెచ్ట్ (70), లోగాన్ వాన్ బీక్ (59) ఆధిక్యంలోకి వెళ్లి అద్భుతమైన అర్ధ సెంచరీలు ఆడడంతో నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి బౌలర్లకు మంచి స్కోరు అందించింది. అనంతరం ఛేజింగ్ మొదలుపెట్టిన శ్రీలంక జట్టు కడపడి వార్తలు అందేసరికి 28 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.

Video: బౌండరీ కొట్టలేదు.. పరుగులు తీయలేదు.. లంక తప్పిదంతో నెదర్లాండ్స్ ఖాతాలో 5 పరుగులు.. ఎలాగంటే?
Sl Vs Ned

Updated on: Oct 21, 2023 | 5:04 PM

Netherlands vs Sri Lanka, 19th Match: ప్రపంచ కప్ (World Cup 2023) 19వ మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక (NED vs SL) మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో డచ్ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో శ్రీలంక కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ (Kusal Mendis) తప్పిదం కారణంగా డచ్‌ జట్టు బౌండరీ కొట్టకపోయినా.. పరుగులు తీయలేకపోయినా 5 పరుగులు సాధించింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంక జట్టు ఇన్నింగ్స్‌లో 43వ ఓవర్‌ను చమిక కరుణరత్నే బౌలింగ్ చేశాడు. అతని ఓవర్ రెండో బంతికి, సీబ్రాండ్ ఎంగిల్‌బ్రెచ్ట్ ఆఫ్ సైడ్‌లో షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి తప్పిపోయింది. బంతి తిరిగి బౌన్స్ అయింది. వికెట్ కీపర్ మెండిస్ నేలపై మోకరిల్లి బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, బంతి అతని చేతుల్లోంచి జారి నేలపై ఉంచిన హెల్మెట్‌కు తగిలింది. దీంతో అంపైర్ నెదర్లాండ్స్‌కు పెనాల్టీగా 5 పరుగులు ఇవ్వడంతో కెప్టెన్, బౌలర్ ఇద్దరి ముఖాలు వాడిపోయాయి.

ఐసీసీ నిబంధనల ప్రకారం నేలపై ఉంచిన హెల్మెట్‌కు బంతి తగిలితే బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు పెనాల్టీగా ఐదు పరుగులు లభించడం గమనార్హం. తరచుగా వికెట్ కీపర్లు స్పిన్ బౌలర్‌లకు వ్యతిరేకంగా హెల్మెట్‌లను ధరించడం, ఫాస్ట్ బౌలర్‌లకు వ్యతిరేకంగా వాటిని నేలపై ఉంచడం కనిపిస్తోంది. ఈ కారణంగా, కొన్నిసార్లు బంతి హెల్మెట్‌తో తాకినట్లయితే పెనాల్టీ విధించబడుతుంది.

శ్రీలంకకు సవాల్‌ విసిరిన నెదర్లాండ్స్..

ఈ మ్యాచ్‌లో ముందుగా ఆడిన డచ్ జట్టుకు ఆరంభం చాలా దారుణంగా ఉంది. ఒక దశలో 91 పరుగుల వద్ద తమ ఆరుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ల వికెట్లను కోల్పోయింది. ఇక్కడి నుంచి ఎంగిల్‌బ్రెచ్ట్ (70), లోగాన్ వాన్ బీక్ (59) ఆధిక్యంలోకి వెళ్లి అద్భుతమైన అర్ధ సెంచరీలు ఆడడంతో నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి బౌలర్లకు మంచి స్కోరు అందించింది.

అనంతరం ఛేజింగ్ మొదలుపెట్టిన శ్రీలంక జట్టు కడపడి వార్తలు అందేసరికి 28 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.

ఇరు జట్లు:

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా, కుసల్ మెండిస్(కెప్టెన్/కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/కీపర్), లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్టెన్, పాల్ వాన్ మీకెరెన్.

మరన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..