
వన్డే ప్రపంచకప్ 2023 స్టార్ట్ అయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్.. ప్రత్యర్ధి ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్ అప్పజెప్పాడు. దాదాపుగా తొమ్మిది మంది బ్యాటర్లతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్‌ను కివీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అడ్డుకున్నారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ జో రూట్(77) అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. జోస్ బట్లర్(43), బెయిర్‌స్టో(33) ఫర్వాలేదనిపించారు. ఇక చివర్లో రషీద్(15), వుడ్(13) వేగంగా పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కివీస్ బౌలర్లలో హెన్రీ 3 వికెట్లు పడగొట్టగా.. ఫిలిప్స్, శాంట్నర్ చెరో రెండు వికెట్లు.. బౌల్ట్, రవీంద్ర తలో వికెట్ తీశారు.
ఎప్పటిలానే ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌లో కీలక పాత్ర పోషించాడు జో రూట్. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్ 86 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. కీలక సమయాల్లో బౌండరీలు కొడుతూ.. మరోపక్క టూస్, త్రీస్ తీస్తూ.. స్కోర్ బోర్డు వేగంగా కదిలించాడు రూట్. ఒకానొక దశలో సెంచరీ చేస్తాడనుకున్న రూట్‌ను పార్ట్ టైం స్పిన్నర్ ఫిలిప్స్ అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు. అలాగే డేంజరస్ ప్లేయర్ అయిన మొయిన్ అలీ(11) సైతం తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు గ్లెన్ ఫిలిప్స్.
న్యూజిలాండ్ కీ బౌలర్ టిం సౌథీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఇక అతడి స్థానంలో తుది జట్టులోకి వచ్చిన మాట్ హెన్రీ తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. పొదుపుగా బౌలింగ్ వేయడమే కాకుండా.. ఇంగ్లాండ్ బ్యాటరలైన జోస్ బట్లర్(43), డేవిడ్ మలన్(14), సామ్ కర్రన్(14) వికెట్లను కీలక సమయాల్లో తీసి.. ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు.
🚨🚨Alert
For the first ever time in ODI cricket, all 11 players scored in double figures. This never happened before#NZvENG #NZvsENG #NeerajChopra #SanjaySingh#ENGvNZ #ENGvsNZ#ODIWorldCup #Elvisha #BabarAzam #PAKvNED#Salaar #LeoTrailer #LeoHindi #LALISA #England pic.twitter.com/S8GQJDXLM1— Cricket Syndrome ➡️ (@CricketSyndrome) October 5, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..