AUS vs PAK: 4,6,1,4,4,4.. పాక్‌ స్పీడస్టర్‌కు చుక్కలు చూపించిన ఆసీస్‌ ఓపెనర్లు.. వీడియో చూశారా?

వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 20) బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్ బాబర్ ఆజం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే బాబర్‌ తీసుకున్న ఈ నిర్ణయం తప్పని ఆదిలోనే తేలిపోయింది. ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌లు ప్రారంభం నుంచే పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మెరుపు వేగం, లైన్ అండ్ లెంగ్త్ తో బంతులేస్తాడని పేరున్న హారిస్‌ రవూఫ్ కు పట్ట పగలే చుక్కలు చూపించారు.

AUS vs PAK: 4,6,1,4,4,4.. పాక్‌ స్పీడస్టర్‌కు చుక్కలు చూపించిన ఆసీస్‌ ఓపెనర్లు.. వీడియో చూశారా?
Australia Vs Pakistan

Updated on: Oct 20, 2023 | 7:06 PM

వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 20) బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్ బాబర్ ఆజం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే బాబర్‌ తీసుకున్న ఈ నిర్ణయం తప్పని ఆదిలోనే తేలిపోయింది. ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌లు ప్రారంభం నుంచే పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మెరుపు వేగంతో బంతులేస్తాడని పేరున్న హారిస్‌ రవూఫ్ కు పట్ట పగలే చుక్కలు చూపించారు. వార్నర్‌, మిచెల్‌ ధాటిగా ఆడడంతో తొమ్మిదో ఓవర్‌లోనే రవూఫ్‌ను దింపాడు బాబర్‌. తన స్పీడ్‌తో ఇద్దరు బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని పాక్‌ కెప్టెన్‌ భావించాడు. అయితే అదేమీ జరగలేదు. తొలి బంతికే వార్నర్ ఫోర్ కొట్టాడు. రెండో బంతికి భారీ సిక్సర్‌ బాదాడు. ఆ తర్వాత మూడో బంతికి సింగిల్‌ తీయడంతో మార్ష్ స్ట్రైక్ అందుకున్నాడు. తర్వాతి బంతి వైడ్‌ కాగా, ఆపై మూడు బంతులను మార్ష్ బౌండరీలుగా మలిచాడు. ఈ ఓవర్‌లో మొత్తం 24 పరుగులు వచ్చాయి. 12వ ఓవర్‌లో బాబర్ మళ్లీ రౌఫ్‌ను పిలిచాడు. మళ్లీ కథ మామూలే.. మార్ష్ తొలి బంతికే ఫోర్ కొట్టాడు. ఆతర్వాత కూడా బౌండరీల వర్షం కురిసింది. రవూఫ్ అన్ని రకాల లెంగ్త్‌లలో బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. ఆసీస్‌ బ్యాటర్ల ధాటికి కేవలం 3 ఓవర్లలోనే 47 పరుగులు సమర్పించుకున్నాడు రవూఫ్‌.

కాగా వార్నర్, మార్ష్ లు పాక్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా పరుగుల వర్షం కురిపిసత్ఉన్నారు. 13వ ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టి వార్నర్ 50 పరుగులు పూర్తి చేశాడు. ఇందుకు కేవలం 38 బంతులు తీసుకోవడం విశేషం. ఆ తర్వాత మార్ష్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 15వ ఓవర్ రెండో బంతికి ఒక పరుగు తీసుకుని మార్ష్ హాఫ్‌ సెంచరీపూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 169 పరుగులు చేసింది ఆసీస్‌. వార్నర్‌ (83), మార్ష్‌ (75) సెంచరీల దిశగా పయనిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

ఒకే ఓవర్లో 24 పరుగులు..

ఇరు జట్లు..

ఆస్ట్రేలియా జట్టు :

డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

పాకిస్థాన్ జట్టు:

అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, ఉసామా మీర్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..