వరల్డ్‌కప్‌లో భారత్ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాట్స్‌మన్, బౌలర్లు సంయుక్తంగా రాణిస్తూ ఇంగ్లాండ్ గడ్డపై ప్రపంచ దేశాల సాక్షిగా భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో టీం ఇండియా పుల్ జోష్‌లో ఉంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన పోరులో కోహ్లీసేన 89 పరుగులతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో దాయాది బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లు కట్టడి చేసిన విధానం అద్భుతం. ముఖ్యంగా కుల్‌దీప్ తన మ్యాజిక్ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. 24వ ఓవర్‌లో అజామ్‌ను ఔట్ చేసిన బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్‌సైడ్ వేసిన బంతి గిర్రున తిరిగి వికెట్లను చెదరగొట్టడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అక్కడితో ప్రారంభమైన పాకిస్థాన్ వికెట్ల పతనం వర్షం పడే వరకు కొనసాగుతూనే ఉంది.
Watch Kuldeep Yadav’s magical delivery to dismiss Babar Azam, and all the other Pakistan wickets #INDvPAK #CWC19 #TeamIndia pic.twitter.com/ybqvLYy9Ul
— ICC (@ICC) June 16, 2019