ఇది యుద్ధం కాదు.. ఆట మాత్రమే

| Edited By:

Jun 15, 2019 | 10:33 AM

ప్రపంచవ్యాప్తంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ మ్యాచ్ కోసం దాయాది దేశాల అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సైతం ఆసక్తిని కనబరుస్తారు. అంతేకాదు ఈ రెండింటి మధ్య మ్యాచ్‌ అంటే బిజినెస్‌ కూడా ఓ రేంజ్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఈ నెల 16న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు […]

ఇది యుద్ధం కాదు.. ఆట మాత్రమే
Follow us on

ప్రపంచవ్యాప్తంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ మ్యాచ్ కోసం దాయాది దేశాల అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సైతం ఆసక్తిని కనబరుస్తారు. అంతేకాదు ఈ రెండింటి మధ్య మ్యాచ్‌ అంటే బిజినెస్‌ కూడా ఓ రేంజ్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఈ నెల 16న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు పాకిస్థాన్ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కొన్ని సూచనలు ఇచ్చారు.

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగేది యుద్ధం కాదని, కేవలం ఆట మాత్రమేనని వసీమ్ అన్నారు. ఏ ఆటనైనా అందరూ ఎంజాయ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.‘‘ ఒక టీమ్ గెలుస్తుంది. మరో టీమ్ ఓడుతుంది. దేన్నైనా గొప్పగా తీసుకోండి. కానీ యుద్ధంలా భావించకండి. ఈ ఆటను యుద్ధంగా భావించే వారు అస్సలు క్రికెట్ అభిమానులే కాదు’’ అంటూ ఆయన పేర్కొన్నారు.

‘‘బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో టీం ఇండియా స్ట్రాంగ్ ఉందన్న విషయం తెలుసు. వారికి ధీటుగా పాకిస్తాన్ కూడా సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌ను గెలవాలని రెండు టీమ్‌ల మెంబర్స్ అధిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆటకు వరణుడు అడ్డుకట్ట వేయకుంటే బావుంటుంది. భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు’’ అంటూ వసీమ్ తెలిపారు. అయితే వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లను ఆడిన ఇండియా.. అందులో రెండింటిని గెలిచింది. వాన కారణంగా మరో మ్యాచ్ రద్దైంది. మరోవైపు పాకిస్తాన్ కూడా మూడు మ్యాచ్‌లను ఆడగా.. రెండింటిలో పరాజయం పాలైంది. వర్షం కారణంగా మూడో మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే.