ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. సూపర్‌ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ సెంచరీతో కదం తొక్కాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్… 5 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది.
లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా విరోచితంగా పోరాడింది. ఒక దశలో లక్ష్యాన్ని చేధిస్తుందా అనిపించింది. అయితే కీలక సమయంలో వికెట్లు పడగొట్టిన ఆసీస్.. బంగ్లా ఆశలపై నీళ్లు చల్లింది. మొత్తం 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది బంగ్లాదేశ్.