ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్ సాంగ్ రిలీజ్.. కొత్త అవతారంలో విరాట్, పొలార్డ్, రషీద్, మాక్స్‌వెల్‌..!

|

Sep 23, 2021 | 5:25 PM

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది.

ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్ సాంగ్ రిలీజ్.. కొత్త అవతారంలో విరాట్, పొలార్డ్, రషీద్, మాక్స్‌వెల్‌..!
T20 World Cup 2021
Follow us on

ICC T20 World Cup 2021: ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021కు దాదాపు ఒక నెల సమయం మిగిలి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ నవంబర్ 14 వరకు కొనసాగుతుంది. అన్ని జట్లు దీని కోసం సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్‌లో అనుభవాన్ని పొట్టి ప్రపంచ కప్‌నకు ఉపయోగించుకునే పనిలో అన్ని జట్టు నిమగ్నమయ్యాయి. తాజాగా ఐసీసీ నుంచి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రపంచకప్ థీమ్ సాంగ్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ పాటకు ‘లైవ్ ది గేమ్’ అని పేరు పెట్టారు. ఈమేరకు ఐసీసీ ఒక ప్రకటన జారీ విడుదల చేసింది. ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో పంచుకుంది. ఐసీసీ విడుదల చేసిన ఈ పాట భారతదేశ స్వరకర్త అమిత్ త్రివేది స్వరపరిచినట్లు పేర్కొన్నారు.

వీడియోలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్‌లు వీడియోలో కొత్త అవతారంలో కనిపించారు. యానిమేటెడ్ అవతారంలో వీరు వీడియోలో సందడి చేశారు. అలాగే యువ అభిమానులు టీ20 క్రికెట్ వైపు ఆకర్షితులై తమ అభిమాన ఆటగాళ్లతో ఆడుకుంటున్నట్లు చూపించారు.

కొత్త సాంకేతికతో విడుదలైన సాంగ్
ఈ పాటలో అవతార్ యానిమేషన్ సరికొత్త ప్రసార సాంకేతికతను ఉపయోగించింది. ఇది 2D, 3D సాంకేతికలను కలిగి ఉంది. దీన్ని రూపొందించడానికి డిజైనర్లు, మోడలర్లు, మ్యాట్ పెయింటర్‌లు, యానిమేటర్లు, లైటర్లు, కంపోజిటర్లు సహా 40 మందిని తీసుకున్నారు. దీనిని చూసిన తర్వాత ప్రస్తుత విజేత వెస్టిండీస్ కీరన్ పొలార్డ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “అన్ని వయసుల అభిమానులను ఆకర్షించేందుకు టీ 20 క్రికెట్ ఎప్పుడూ రెడీగా ఉంటోంది. అలాంటి వారి కోసం యూఏఈలో సందడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని రాసుకొచ్చాడు.

మాక్స్‌వెల్ కూడా..
మాక్స్‌వెల్ కూడా టీ 20 ప్రపంచకప్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా మ్యాక్స్‌వెల్ చెప్పాడు. “ఐసీసీ టీ20 ప్రపంచ కప్ చాలా కష్టమైనది. అలాగే చాలా ఉత్తేజకరమైనది. ట్రోఫీని గెలుచుకోగల సత్తా అనేక జట్లకు ఉంది. ప్రతీ మ్యాచ్ ఫైనల్ లాగా ఉంటుంది. మేం దానికోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం” అంటూ వెల్లడించాడు.

ఇండో-పాక్ మ్యాచ్
పాకిస్థాన్, భారత్ టీంలు ఈ పొట్టి ప్రపంచకప్‌లో గ్రూప్ -2 లో చోటు దక్కించుకున్నాయి. వీటితోపాటు అదే గ్రూపులో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ టీంలు కూడా ఉన్నాయి. అదే సమయంలో క్వాలిఫైయింగ్ రౌండ్‌ నుంచి మరో రెండు జట్లు వస్తాయి. అక్టోబర్ 24న భారత్ తన బద్ధశత్రువు పాకిస్థాన్‌‌తో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అలాగే అక్టోబర్ 31 న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3 న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. అలాగే నవంబర్ 5, 8వ తేదీలలో మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.

Also Read: Sunrisers Hyderabad: ఢిల్లీ మ్యాచ్‌లో ఓడినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నెట్టింట్లో గెలిపించిన మిస్టరీ అమ్మాయి.. ఆమె ఎవరో తెలుసా?

IPL 2021: ధావన్, కేఎల్ రాహుల్‌ల మధ్య తీవ్రమైన పోటీ.. ఎవరికీ అందనంత ఎత్తులో హర్షల్ పటేల్.. ఎందులోనో తెలుసా?