Virat Kohli : కోహ్లీ రికార్డులో ఐసీసీ భారీ స్కామ్..ఏకంగా 722 రోజులు మాయం..ఫ్యాన్స్ ఆగ్రహంతో దిగొచ్చిన బోర్డు

Virat Kohli : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్ళీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటన చేసే క్రమంలో ఐసీసీ ఒక భారీ తప్పిదం చేసింది. కోహ్లీ రికార్డుకు సంబంధించిన కొన్ని వందల రోజులను లెక్కలోకి తీసుకోకుండా తక్కువ చేసి చూపించింది. దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో ఐసీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Virat Kohli : కోహ్లీ రికార్డులో ఐసీసీ భారీ స్కామ్..ఏకంగా 722 రోజులు మాయం..ఫ్యాన్స్ ఆగ్రహంతో దిగొచ్చిన బోర్డు
Virat Kohli

Updated on: Jan 16, 2026 | 7:26 AM

Virat Kohli : టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మళ్ళీ చాటుకున్నాడు. జనవరి 14, 2026న న్యూజిలాండ్‌తో జరిగిన వడోదర వన్డేలో 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానానికి చేరుకున్నాడు. 2021 తర్వాత విరాట్ మళ్ళీ అగ్రస్థానానికి రావడం గమనార్హం. అయితే కోహ్లీ నంబర్-1 స్థానంలో ఎన్ని రోజులు ఉన్నాడనే విషయంలో ఐసీసీ లెక్క తప్పింది. కోహ్లీ మొత్తం 825 రోజులు మాత్రమే టాప్‌లో ఉన్నాడని ఐసీసీ మొదట పోస్ట్ చేసింది. కానీ అసలు లెక్క చూస్తే విరాట్ ఏకంగా 1547 రోజులు నంబర్-1 కుర్చీలో కూర్చున్నాడు. అంటే ఐసీసీ పొరపాటున 722 రోజులను గాలికొదిలేసింది. ఐసీసీ చేసిన ఈ పొరపాటును కోహ్లీ అభిమానులు ఇంటర్నెట్‌లో ఎండగట్టారు. 2017 నుండి 2021 వరకు వరుసగా 1257 రోజులు కోహ్లీ నంబర్-1 గా ఉన్న రికార్డును ఐసీసీ ఎలా మర్చిపోతుందంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కింగ్ కోహ్లీ ఘనతను తక్కువ చేసి చూపించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఐసీసీ వెంటనే అప్రమత్తమైంది. తన తప్పును తెలుసుకుని ఆ పాత పోస్ట్‌ను తొలగించి, సరికొత్త లెక్కలతో విరాట్ కోహ్లీ ఘనతను కొనియాడుతూ కొత్త వివరణ ఇచ్చింది.

ఐసీసీ తన వివరణలో ఇలా పేర్కొంది.. “భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి అక్టోబర్ 2013లో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు అతను మొత్తం 1547 రోజులు నంబర్-1 స్థానంలో ఉన్నాడు. ఏ భారతీయ బ్యాటర్ కూడా ఇన్ని రోజులు అగ్రస్థానంలో లేడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, వెస్టిండీస్ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్ (2306 రోజులు) మొదటి స్థానంలో ఉండగా, కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.” అని స్పష్టం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే, కోహ్లీ తన కెరీర్‌లో సుమారు 4 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా రాజ్యమేలాడు.

విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో విమర్శలు చేసిన వారికి ఈ ర్యాంకింగ్ ఒక గట్టి సమాధానం అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 2017-2021 మధ్య కాలంలో విరాట్ ఆడిన ఆ ఆటను చూసి ప్రపంచ క్రికెట్ జడిసింది. ఇప్పుడు మళ్ళీ అదే పాత కోహ్లీని చూస్తున్నామని, ఈసారి నంబర్-1 స్థానంలో మరిన్ని రోజులు కొనసాగి వివ్‌ రిచర్డ్స్ రికార్డుకు చేరువవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీ తన తప్పును ఒప్పుకోవడంతో కింగ్ కోహ్లీ రికార్డుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.