రవిశాస్త్రి భారత జట్టుకు ప్రధాన కోచ్ కావడానికి ముందు, అతను 2014లో దాని జట్టుకు డైరెక్టర్‌గా పనిచేశాడు. అప్పుడే విరాట్ కోహ్లీ క్రికెట్‌లో ఆద్భతంగా రాణిస్తున్నాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శిఖర్ ధావన్ వంటి వారు స్టార్ బ్యాట్స్మెన్లుగా అభివృద్ధి చెందారు. మహ్మద్ షమీ తనను తాను నిరూపించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా రాక భారత బౌలింగ్‌కు బలాన్ని చేకూర్చింది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తానేంటో నిరూపించుకున్న రోహిత్ 2019లో దక్షిణాఫ్రికాతో టెస్ట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
సొగసైన కుడిచేతి వాటం ఆటగాడు దానిని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్ట్ ఓపెనర్‌గా అరంగేట్రంలో రెండు సెంచరీలు సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రోహిత్ రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు చేసి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఆరో భారతీయుడిగా నిలిచాడు.
ట్ చేస్తే రోహిత్ శర్మ 8 టెస్ట్ సెంచరీలతో3000 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి ఇటీవల టెస్ట్ వైస్-కెప్టెన్సీ బాధ్యత కూడా అప్పగించారు. ప్రస్తుతం అతను ఓపెనర్‌గా మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నాడు. అయితే రోహిత్ శర్మను టెస్ట్ అరంగేట్రం భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడరు. రోహత్ను టెస్ట్‌ల్లో ఓపెనర్ పంపాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. బ్యాట్స్‌మెన్‌గా అతని వద్ద ప్రతిభ ఉండి దానిని పొందలేకపోతే నేను కోచ్‌గా విఫలమైనట్లే” అని శాస్త్రి చెప్పాడు.
శాస్త్రి రోహిత్, విరాట్ కోహ్లీల కెప్టెన్సీ స్టైల్స్‌పై కూడా మాట్లాడారు. వారిని భారత దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లతో పోల్చారు. “మీరు ఇద్దరిని (కోహ్లీ,రోహిత్) కెప్టెన్సీని పోల్చి చూస్తే, అది నాకు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లను గుర్తు చేస్తుంది. విరాట్ కపిల్ లాగా, రోహిత్ గవాస్కర్ లాగా ఉన్నాడు” అని వివరించాడు. ఈ మధ్యే రోహిత్ శర్మ వైట్-బాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Read Also.. Irfan Pathan: రెండోసారి తండ్రైన టీమిండియా మాజీ క్రికెటర్.. ముద్దుల కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..