Team India: 3 ఫార్మాట్లు.. ముగ్గురు సారథులు.. అనుమానాలు పెంచిన హెడ్ కోచ్ వ్యాఖ్యలు..

|

Jan 24, 2023 | 9:24 AM

Rahul Dravid: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తర్వాత బీసీసీఐ వన్డేలు, టీ20లకు వేర్వేరు కెప్టెన్లను నియమించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Team India: 3 ఫార్మాట్లు.. ముగ్గురు సారథులు.. అనుమానాలు పెంచిన హెడ్ కోచ్ వ్యాఖ్యలు..
Rahul Dravid Team India
Follow us on

ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత భారత క్రికెట్ జట్టులో పరిమిత ఓవర్లలో వేర్వేరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీ20, వన్డేల్లో వేర్వేరుగా కెప్టెన్లను నియమించే ఆలోచనలో ఉన్నట్లు పలు మీడియా కథనాలలో పేర్కొంది. శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పుడు కూడా ఇలాంటి చర్చలే వచ్చాయి. టీమ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను వేర్వేరు కెప్టెన్ల నియామకంపై ప్రశ్నలు కురిపించారు. దీంతో మరింత గందరగోళం నెలకొంది.

టీ20 ప్రపంచకప్ తర్వాత, న్యూజిలాండ్ టూర్‌లో పాండ్యాను టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. ఆపై రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పుడు, రోహిత్ గురించి ఎలాంటి ప్రకటన కూడా ఇవ్వలేదు. దీంతో పాండ్యాకు టీ20 జట్టు కమాండ్ ఇవ్వడం దాదాపుగా స్పష్టమైంది.

ప్రస్తుతం టీమ్ ఇండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో చివరి వన్డే నేడు ఇండోర్‌లో జరగనుంది. సోమవారం ఈ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశానికి వచ్చిన ద్రవిడ్‌ను వేర్వేరు కెప్టెన్లను నియమించడంపై ఒక ప్రశ్న అడిగారు. దానిపై ద్రవిడ్ మాట్లాడుతూ, “నాకు దాని గురించి తెలియదు. మీరు సెలెక్టర్లను అడగాల్సిన ప్రశ్న ఇది. కానీ ఇప్పటికి నేను అలా అనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ద్రవిడ్ ప్రకటన వల్ల బీసీసీఐ ఏ ప్లానింగ్‌తో పనిచేస్తుందో.. ఆ జట్టు కోచ్‌కే అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. అదే విలేకరుల సమావేశంలో రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్‌లకు టీ20ల నుంచి విశ్రాంతినిస్తున్నట్లు రాహుల్ స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే పాండ్యాకు టీ20 జట్టు కమాండ్‌ను ఇంకా పూర్తిగా అప్పగించలేదని తెలుస్తోంది. అయితే వన్డేల్లో జట్టుకు వైస్ కెప్టెన్‌గా హార్దిక్ ఎంపికైన సంగతి తెలిసిందే.

మార్పులు తప్పవన్న ద్రవిడ్..

ఈ గందరగోళానికి మరో కారణం కూడా ఉంది. అదే ద్రవిడ్ ప్రకటన. భారత టీ20 జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉందని, సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఈ నెల ప్రారంభంలో ద్రావిడ్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, టీ20 క్రికెట్‌లో తన భవిష్యత్తు గురించి తాను నిర్ణయించుకోలేదని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఈ నెలలో న్యూజిలాండ్‌తో మూడు టీ20లు ఆడాల్సి ఉందని రోహిత్ తెలిపాడు. మరి ఐపీఎల్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. నేను ఫార్మాట్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకోలేదంటూ ఆయన ప్రకటించాడు.

రంజీ ట్రోఫీకి నో..

జనవరి 31 నుంచి రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ జరగనుండగా, ఫిబ్రవరి 2 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభం కానుంది. రంజీ క్వార్టర్ ఫైనల్స్ ఆడేందుకు భారత జట్టులోని సభ్యులెవరూ అందుబాటులో ఉండరు. కుర్రాళ్లు ఆడాలని కోరుకున్నాం. కానీ, అది మాకు కష్టమైన నిర్ణయమని ద్రవిడ్ ప్రకటించాడు. మేం ఏ ఆటగాడిని డ్రాప్ చేయలేం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..