మై నేమ్ ఈజ్ పంత్..నాది పాజిటీవ్ మైండ్‌సెట్ బాస్

|

Jun 22, 2019 | 12:14 PM

సౌథాంప్టన్‌: వరల్డ్ కప్‌కు ఎంపిక కాకపోవడంతో కుంగిపోలేదని.. మరింత పాజిటీవ్‌గా మారిపోయానని యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ అన్నాడు. తనను తాను మెరుగు పరుచుకొనేందుకు ఆటపై ఎంతో దృష్టిపెట్టానని ..సరైన సమయంలో అవకాశాలు అవే వస్తాయని వెల్లడించాడు. ఓపెనర్ శిఖర్ ధావన్‌ బొటన వేలికి గాయం కావడంతో పంత్‌ను బ్యాకప్‌ ఆటగాడిగా ఇంగ్లాండ్‌కు పిలిపించారు. గబ్బర్‌ గాయం మానకపోవడంతో అతడు ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. అతడి స్థానంలో పంత్‌కు టీమిండియాలో చోటు దక్కింది. ‘ప్రపంచకప్‌నకు ఎంపిక కాకపోవడంతో […]

మై నేమ్ ఈజ్ పంత్..నాది పాజిటీవ్ మైండ్‌సెట్ బాస్
Follow us on

సౌథాంప్టన్‌: వరల్డ్ కప్‌కు ఎంపిక కాకపోవడంతో కుంగిపోలేదని.. మరింత పాజిటీవ్‌గా మారిపోయానని యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ అన్నాడు. తనను తాను మెరుగు పరుచుకొనేందుకు ఆటపై ఎంతో దృష్టిపెట్టానని ..సరైన సమయంలో అవకాశాలు అవే వస్తాయని వెల్లడించాడు. ఓపెనర్ శిఖర్ ధావన్‌ బొటన వేలికి గాయం కావడంతో పంత్‌ను బ్యాకప్‌ ఆటగాడిగా ఇంగ్లాండ్‌కు పిలిపించారు. గబ్బర్‌ గాయం మానకపోవడంతో అతడు ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. అతడి స్థానంలో పంత్‌కు టీమిండియాలో చోటు దక్కింది.

‘ప్రపంచకప్‌నకు ఎంపిక కాకపోవడంతో నేనేదో సరిగ్గా చేయలేదని అనుకున్నా. అప్పుడు నేను మరింత పాజిటీవ్‌గా మారిపోయా. నన్ను నేనే మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించా. ఆ తర్వాత ఐపీఎల్‌లో రాణించా. నిరంతరం సాధన చేస్తూనే ఉన్నా. భారత్‌ గెలవాలన్నది ప్రతి ఒక్కరి కల. నేను బ్యాకప్‌గా ఎంపికయ్యానని తెలిసినప్పుడు అమ్మ నా పక్కనే ఉంది. మా అమ్మకు విషయం చెప్పగానే ఆమె గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించింది. ఒక క్రికెటర్‌గా ప్రపంచకప్‌ ఆడాలని నేనెప్పుడూ కోరుకున్నా. నాకు ఆ అవకాశం వచ్చింది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని పంత్‌ అన్నాడు.