
మే 16, శుక్రవారం నాడు వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుక ఎంతో ఘనంగా జరిగింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) ఆయనను సత్కరించడంతో పాటు, స్టేడియంలో రోహిత్ పేరుతో కొత్త స్టాండ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్, రోహిత్ కుటుంబ సభ్యులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇది రోహిత్ శర్మ చేసిన అద్భుతమైన క్రికెట్ కృషికి గౌరవంగా నిలిచింది.
అయితే ఈ వేడుక ప్రారంభానికి ముందు ఒక చిన్న ఘటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి వాంఖడే మెట్లపైకి అడుగుపెడుతున్న సమయంలో ఆయన స్వల్పంగా అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, ఆయన హిందీలో “సాత్ మే రఖ్ ఇన్ ఇంకో, తు అప్నే సాత్ మే రఖ్ నా ఇంకో” అని మాట్లాడుతూ కనిపించారు. దీనర్థం ఆయన ఎవరి గురించి జాగ్రత్తగా చూసుకోవాలని సూచించినట్లు కనిపిస్తోంది, బహుశా పిల్లలు లేదా తల్లిదండ్రులు కావచ్చు. తన భావోద్వేగాలను బయటపెట్టడంలో ఎప్పుడూ వెనుకబడని రోహిత్ ఈ సందర్భంలోనూ తన కుటుంబంపై ప్రేమను ఇలానే చాటాడు. ఇది పెద్ద ఉదంతం కాకపోయినా, స్టేడియంలోకి అడుగుపెట్టే ముందు రోహిత్ ఆత్మీయంగా స్పందించిన ఒక చిన్న సంఘటనగా నిలిచింది.
ఈ వేడుకలో రోహిత్ శర్మ పేరుతో పాటు, భారత క్రికెట్ దిగ్గజాలు అజిత్ వాడేకర్, శరద్ పవార్ పేర్లతో కూడిన స్టాండ్లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ తన ప్రసంగంలో, తన పేరు మీద స్టాండ్‌ను చూడటం ఎంతో గర్వకారణంగా ఉందని, ఇది జీవితాంతం మర్చిపోలేని క్షణమని అన్నారు. ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్ ప్రస్తుతం భారత్ తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.
ఇకపోతే, రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో మధ్యలో వచ్చిన విరామం తర్వాత టోర్నమెంట్ మే 17న తిరిగి ప్రారంభంకానుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, వారి ఖాతాలో ఇప్పటికే 14 పాయింట్లు ఉన్నాయ్. దీంతో, ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. రోహిత్ శర్మ ఆటలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ అభిమానులకు ప్రతి క్షణం ప్రేరణనిచ్చే వ్యక్తిగా కొనసాగుతున్నాడు.
"Sath me rakh na inko" 😂
Rohit Sharma in angry on someone.🧐 pic.twitter.com/CLXZQbg3FL
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 16, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..