
Fastest Fifty : టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్ చరిత్ర సృష్టించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హెట్‌మైర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల సునామీ సృష్టించిన అతను.. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 17 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టాడు. కేవలం ఒక్క బంతి తేడాతో గేల్‌ను వెనక్కి నెట్టి, వరల్డ్ కప్‌లో విండీస్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు కెక్కాడు.
గాల్లోకి 17 ఏళ్ల గేల్ రికార్డు
నిజానికి వెస్టిండీస్ క్రికెట్ అంటేనే సిక్సర్లు, పవర్‌ఫుల్ హిట్టింగ్. 2009 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై క్రిస్ గేల్ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. గత 17 ఏళ్లుగా ఏ వెస్టిండీస్ బ్యాటర్ కూడా ఆ రికార్డును అందుకోలేకపోయాడు. కానీ నేడు స్కాట్లాండ్‌పై షిమ్రాన్ హెట్‌మైర్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకుని గేల్ రికార్డును చెరిపివేశాడు. 177.77 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన హెట్‌మైర్, తన ఇన్నింగ్స్‌లో 6 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. మొత్తం 36 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు.
విండీస్ బ్యాటర్ల దండయాత్ర
టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (35), షే హోప్ (19) మొదటి వికెట్‌కు 54 పరుగులు జోడించినప్పటికీ వేగంగా ఆడలేకపోయారు. కానీ వన్ డౌన్ లో వచ్చిన హెట్‌మైర్ పిచ్‌పై అడుగుపెట్టిన క్షణం నుంచే విధ్వంసం మొదలుపెట్టాడు. అతడికి తోడుగా కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (24), రూథర్‌ఫోర్డ్ (26) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. రూథర్‌ఫోర్డ్ కేవలం 13 బంతుల్లోనే 200 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం.
నిరాశ పరిచిన స్కాట్లాండ్ బౌలర్లు
కోల్‌కతా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో స్కాట్లాండ్ బౌలర్లు హెట్‌మైర్ ధాటిని తట్టుకోలేకపోయారు. బ్రాడ్ క్యూరీ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించినా, మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. షఫయాన్ షరీఫ్, డేవిడ్సన్, మైఖేల్ లీస్క్‌లకు తలో వికెట్ దక్కింది. వెస్టిండీస్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యం స్కాట్లాండ్‌కు పెద్ద సవాలుగా మారింది. విండీస్ బౌలింగ్ అటాక్ ముందు స్కాటిష్ బ్యాటర్లు ఎంతవరకు నిలబడతారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..