
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ ఘోర ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ ఛాన్స్‌లు క్లిష్టంగా మారాయి. ప్రస్తుతం లీగ్ స్టేజిలో 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 6 ఓటములతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది ముంబై. ఇక చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలబడనున్న ముంబై.. ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే ఆ జట్టుపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ముంబై నెట్ రన్‌రేట్ -0.128.. అటు ఆర్సీబీ, పంజాబ్ జట్లకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు ఆ మ్యాచ్‌ల్లో గెలిస్తే.. చెరో 16 పాయింట్లు వస్తాయి. ఈ తరుణంలో ముంబై తన చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. అలాగే బెంగళూరు, లక్నో, చెన్నై, పంజాబ్ జట్లు తమ ఆఖరి మ్యాచ్‌ల్లో తప్పక ఓడిపోవాలి. లేదంటే.. రోహిత్ సేన ఇంటి దారి పట్టడం ఖాయం.
కాగా, మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌ని ముంబై ఇండియన్స్ చేజేతులా పోగొట్టుకుంది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హోమ్ టీమ్ అయిన లక్నో సూపర్ జెయింట్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను కాపాడుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్టీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన ముంబై.. చివరికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.