IPL 2024: చెన్నై, బెంగళూరు ఆడే మ్యాచ్‌లివే.. హోం గ్రౌండ్‌లో ఎన్ని గేమ్స్ ఆడనున్నాయంటే.?

|

Feb 22, 2024 | 8:17 PM

లెక్క మారింది. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుందని అందరూ ఊహించారు. కట్ చేస్తే.. అధికారికంగా ఈ సీజన్ షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో తొలి విడతగా 17 రోజులు.. అనగా 21 మ్యాచ్‌లకు షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ.

IPL 2024: చెన్నై, బెంగళూరు ఆడే మ్యాచ్‌లివే.. హోం గ్రౌండ్‌లో ఎన్ని గేమ్స్ ఆడనున్నాయంటే.?
Csk Vs Rcb
Follow us on

లెక్క మారింది. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుందని అందరూ ఊహించారు. కట్ చేస్తే.. అధికారికంగా ఈ సీజన్ షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో తొలి విడతగా 17 రోజులు.. అనగా 21 మ్యాచ్‌లకు షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఇప్పటివరకు అస్సలు టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంది. మరి ఈ తొలి ఫేజ్‌లో చెన్నై, బెంగళూరు ఏయే మ్యాచ్‌లు సొంత మైదానంలో ఆడనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చెన్నై మ్యాచ్‌లు ఇలా..

మార్చి 22న చెపాక్ స్టేడియం(చెన్నై సొంతం మైదానం)లో చెన్నై, బెంగళూరు తలబడనున్నాయి. మార్చి 26న మళ్లీ సొంత మైదానం చెపాక్ స్టేడియంలోనే చెన్నై, గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక వైజాగ్ వేదికగా చెన్నై తన మూడో మ్యాచ్‌లో ఢిల్లీతో తలబడుతుంది. నాలుగో మ్యాచ్‌లో చెన్నై.. హైదరాబాద్ వేదికగా ఏప్రిల్5న సన్‌రైజర్స్‌తో ఆడుతుంది.

బెంగళూరు మ్యాచ్‌లు ఇలా..

బెంగళూరు తన సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 22న చెన్నైతో బెంగళూరు జట్టు చెపాక్ స్టేడియంలో ఆడనుండగా.. మార్చి 25న పంజాబ్‌తో, మార్చి 29న కోల్‌కతాతో, ఏప్రిల్ 2న లక్నోతో బెంగళూరు జట్టు తన హోం గ్రౌండ్‌లో ఆడుతుంది.