వీడెవడో డివిలియర్స్‌కు తమ్ముడిలా.. 44 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. సిక్సర్లతో 6గురి బౌలర్ల ఊచకోత! ఎవరంటే?

|

Feb 06, 2023 | 9:36 AM

దక్షిణాఫ్రికా టీ20 టోర్నమెంట్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు సఫారీల వికెట్ కీపర్. తొలి బంతి నుంచి..

వీడెవడో డివిలియర్స్‌కు తమ్ముడిలా.. 44 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. సిక్సర్లతో 6గురి బౌలర్ల ఊచకోత! ఎవరంటే?
Sunrisers Hyderabad
Follow us on

దక్షిణాఫ్రికా టీ20 టోర్నమెంట్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు సఫారీల వికెట్ కీపర్. తొలి బంతి నుంచి సిక్సర్ల మోత మ్రోగించడమే కాదు.. తన జట్టుకు భారీ స్కోర్ అందించడంలోనూ సహాయపడ్డాడు ఈ ప్లేయర్. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రెండు పెద్ద రికార్డులు బద్దలయ్యాయి. డర్బన్ సూపర్ జెయింట్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసన్ టోర్నీ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ బాదేశాడు. అన్నట్లు మర్చిపోయాం చెప్పడం.. ఈ బ్యాటర్ ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగనున్నాడు.

ప్రిటోరియా క్యాపిటల్స్‌పై మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ జెయింట్స్‌కు ఓపెనర్లు డికాక్(43), మెక్‌డోర్మొట్(41) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇక వన్‌డౌన్‌లో క్రీజులో వచ్చిన క్లాసెన్ కేవలం 43 బంతుల్లోనే అదిరిపోయే సెంచరీ నమోదు చేశాడు. ఇది టోర్నమెంట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. క్లాసెన్ తన సెంచరీని ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ కొట్టి పూర్తి చేశాడు.

మొత్తానికి 44 బంతులు ఎదుర్కున్న క్లాసెన్ 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. క్లాసెన్ కెరీర్‌లో ఇది 141వ టీ20 మ్యాచ్‌ కాగా.. అతడికి ఇదే తొలి టీ20 సెంచరీ. అటు క్లాసెన్‌తో పాటు చివర్లో మాథ్యూ బ్రిజ్కే కూడా 21 బంతుల్లో 46 పరుగులు చేయడంతో డర్బన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఇక ఇదే టోర్నమెంట్‌లో హయ్యస్ట్ స్కోరు.

మరోవైపు 255 పరుగుల లక్ష్యఛేదనలో ప్రిటోరియా క్యాపిటల్స్ చతికిలబడింది. జూనియర్ డాలా(3/33), ప్రిటోరియస్(2/20), ముల్దర్(2/17) ధాటికి ఆ జట్టు 103 పరుగులకే ఆలౌట్ అయింది. బోసచ్(23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో డర్బన్ జెయింట్స్ 151 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి.. తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మొదటి సెంచరీ ఫాఫ్ డుప్లెసిస్ పేరు మీద నమోదైంది. అతడు గత నెలలో ముంబై కేప్ టౌన్‌పై 113 పరుగులు సాధించాడు.