ENG vs SA: ముంబైలో హెన్రిచ్ క్లాసెన్ తుఫాన్.. ఇంగ్లీష్ బౌలర్లపై ఊచకోత.. 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెంచరీ..

Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్ తన వన్డే కెరీర్‌లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. ఈ ఆటగాడు 61 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.

ENG vs SA: ముంబైలో హెన్రిచ్ క్లాసెన్ తుఫాన్.. ఇంగ్లీష్ బౌలర్లపై ఊచకోత.. 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెంచరీ..
Heinrich Klaasen

Updated on: Oct 21, 2023 | 6:28 PM

వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో హెన్రిచ్ క్లాసెన్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ ఆటగాడు 61 బంతుల్లోనే సెంచరీ మార్కును తాకాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు కూడా బాదాడు. హెన్రిచ్ క్లాసెన్ వన్డే కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ.

కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కి దక్షిణాఫ్రికా జట్టు 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబైలోని వాంఖడే మైదానంలో సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 61 బంతుల్లో సెంచరీ సాధించాడు. చివరి 10 ఓవర్లలో ఆ జట్టు 143 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా తరపున రీజా హెండ్రిక్స్ 85, మార్కో జాన్సెన్ 75, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 60, ఐడెన్ మార్క్రామ్ 42 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ 3 వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్ తలో 2 వికెట్లు తీశారు.

ప్రపంచ కప్‌లలో అత్యంత వేగవంతమైన సెంచరీ (ఎదుర్కొన్న బంతుల పరంగా)..

49 మార్క్‌రామ్ v శ్రీలంక, ఢిల్లీ 2023

50 కే ఓ’బ్రియన్ v ఇంగ్లండ్, బెంగళూరు 2011

51 గ్లెన్ మాక్స్‌వెల్ v శ్రీలంక, సిడ్నీ 2015

52 ఏబీ డివిలియర్స్ v వెంస్టిండీస్,​సిడ్నీ 2015

57 ఇయాన్ మోర్గాన్ v ఆప్ఘానిస్తాన్ 2019

61 హెచ్ క్లాసెన్ v ఇంగ్లండ్, ముంబై 2023

ఇరుజట్లు:

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/కెప్టెన్), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగీ ఎన్గిడి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..