3 టెస్టుల్లో 76.. 2 వన్డేల్లో 41 రన్స్.. అయినా అద్బుతంగా ఆడుతున్నాడంటూ యువ ఆటగాడికి ద్రావిడ్ మద్ధతు..

|

Jul 30, 2023 | 8:10 PM

Rahul Dravid On Shubman Gill: భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన 2 టెస్టుల్లో గిల్ 45(6.. 10 & 29 నాటౌట్) పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జరిగిన తొలి వన్డేలో 7, రెండో వన్డేలో 34 రన్స్ చేశాడు. అవకాశాలు ఎన్ని వస్తున్నా సరైన ఇన్నింగ్స్ ఆడడానికి ఇబ్బంది పడుతున్నాడు. అయితే శుభమాన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడంటూ టీమిండియా మాజీ దిగ్గజం, హెడ్ కోచ్..

3 టెస్టుల్లో 76.. 2 వన్డేల్లో 41 రన్స్.. అయినా అద్బుతంగా ఆడుతున్నాడంటూ యువ ఆటగాడికి ద్రావిడ్ మద్ధతు..
Rahul Dravid On Shubman Gill
Follow us on

Rahul Dravid: ఐపీఎల్ 2023 టోర్నీలో గుజరాత్ తరఫున 851 పరుగులు చేయడంతో పాటు 16వ సీజన్‌ టాప్ స్కోరర్‌గా నలిచిన శుభమాన్ గిల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్ తర్వాత జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో 31(13, 18) పరుగులే చేసిన అతను వెస్టిండీస్ పర్యటనలో కూడా అదేలా చేతులెత్తేస్తున్నాడు. భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన 2 టెస్టుల్లో గిల్ 45(6.. 10 & 29 నాటౌట్) పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జరిగిన తొలి వన్డేలో 7, రెండో వన్డేలో 34 రన్స్ చేశాడు. అవకాశాలు ఎన్ని వస్తున్నా సరైన ఇన్నింగ్స్ ఆడడానికి ఇబ్బంది పడుతున్నాడు. అయితే శుభమాన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడంటూ టీమిండియా మాజీ దిగ్గజం, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొస్తున్నాడు.

‘శుభమాన్ గురించి పెద్దగా చింతించే అవసరం లేదు. గిల్ బాగా ఆగడుతున్నాడు. రానున్న కాలంలో మంచిగా కనిపిస్తాడు. ప్రతి మ్యాచ్‌కి ప్లేయర్లను విమర్శించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం కూడా అంత సులభం కాదు. శుభమాన్ బ్యాటింగ్ బాగుంది. ఇంకా భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ అతను చాలా ముఖ్యం. ట్రినిటాడ్‌లో జరిగే మూడో వన్డేలో అతను బాగా ఆడతాడ’ని శుభమాన్ గిల్‌ గురించి ద్రావిడ్ ఆశాభావంగా ఉన్నాడు.

కాగా, గురువారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే శనివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే బరిలోకి దిగి ప్రత్యర్థి చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో సిరీస్ 1-1 గా సమంగా ఉంది. మరోవైపు రానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం యువ ఆటగాళ్లను పరీక్షిస్తూనే ప్రయోగాత్మకంగా ఆడేందుకు భారత జట్టు ప్రయత్నిస్తోంది. ఈ కారణంగానే తొలి వన్డేలో రోహిత్ 7వ స్థానంలో రాగా, కోహ్లీకి బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇంకా రెండో మ్యాచ్‌ని అయితే పూర్తిగా యువ ఆటగాళ్లకే వదిలేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..