IPL 2024: SRH తరిమేస్తే DC క్యాంప్‌లో చేరాడు.. ఆడతాడనుకుంటే చివరికి శఠగోపం పెట్టాడేంటి భయ్యా..

ఈ ప్లేయర్‌ను గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఎన్నో ఆశలతో బరిలోకి దింపింది. అయితేనేం ఆ ఫ్రాంచైజీ నమ్మకాన్ని వొమ్ము చేశాడు. ఇక ఈ ఏడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడ్ని కొనుగోలు చేస్తే.. సీజన్ స్టార్ట్ కాకముందే ఆ జట్టుకు శఠగోపం పెట్టాడు. ఇంతకీ ఎవరో తెలుసా.?

IPL 2024: SRH తరిమేస్తే DC క్యాంప్‌లో చేరాడు.. ఆడతాడనుకుంటే చివరికి శఠగోపం పెట్టాడేంటి భయ్యా..
Dc
Follow us

|

Updated on: Mar 13, 2024 | 6:15 PM

మరో 10 రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఈలోపే ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు మినీ వేలంలో రూ. 4 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్ మొత్తానికి దూరమవుతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీకి వెల్లడించాడు. అటు స్వదేశంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌కి కూడా చివరి నిమిషంలో వ్యక్తిగత కారణాల వల్ల హ్యారీ బ్రూక్ దూరమైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు హ్యారీ బ్రూక్. 2023లో ఈ ఇంగ్లాండ్ యువ ప్లేయర్ పెర్ఫార్మన్స్‌లను అంచనా వేసుకుని.. గతేడాది వేలంలో ఏకంగా రూ. 13.23 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ జట్టు. అయితే హైదరాబాద్ ఫ్రాంచైజీ నమ్మకాన్ని పూర్తిగా వొమ్ము చేశాడు హ్యారీ బ్రూక్. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన బ్రూక్ ఒక సెంచరీతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు.

దీంతో ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఆరెంజ్ ఆర్మీ అతడ్ని విడిచిపెట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్‌ను రూ. 4 కోట్లు పెట్టి వేలంలో సొంతం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా యువ ప్లేయర్ జెక్ ఫ్రాసేర్ మెక్‌గుర్క్.. హ్యారీ బ్రూక్‌ను రీప్లేస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ రీ-ఎంట్రీ ఇస్తున్నాడు.