Women Team India Commonwealth Games 2022: కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ కూడా భాగమైంది. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లు జులై 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు, ఆస్ట్రేలియా మహిళల జట్టుతో తలపడనుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. కాగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.
ఈ టోర్నీకి సెలక్షన్ కమిటీ ఇద్దరు వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌లకు చోటు కల్పించింది. తాన్యా భాటియాతో పాటు యాష్టికా భాటియాకు కూడా అవకాశం కల్పించారు. అదే సమయంలో, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజ కూడా జట్టులో ఉన్నారు. హర్లీన్ డియోల్, స్నేహ రానా కూడా జట్టులో ఉన్నారు.
కాగా, టీం ఇండియా గ్రూప్-ఏలో చోటు దక్కించుకుంది. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జులై 29న బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. రెండో గ్రూప్ మ్యాచ్ పాకిస్థాన్‌తో జరగనుంది. దీని తర్వాత మూడో మ్యాచ్ బార్బడోస్‌తో జరగనుంది.
? NEWS ?: #TeamIndia (Senior Women) squad for Birmingham 2022 Commonwealth Games announced. #B2022 | @birminghamcg22 pic.twitter.com/lprQenpFJv
— BCCI Women (@BCCIWomen) July 11, 2022
భారత మహిళల జట్టు – హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, మేఘన, తాన్య సప్నా భాటియా (కీపర్), యాష్టికా భాటియా (కీపర్), దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్ , జెమిమా రోడ్రిగ్జ్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రానా.
స్టాండ్‌బై – సిమ్రాన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్