Eng Vs Pak: చేతిలో 3 వికెట్లు.. విజయానికి 5 పరుగులు.. కట్ చేస్తే.. ఊహించని షాకిచ్చిన పాక్!

|

Sep 26, 2022 | 12:15 PM

క్రికెట్ అనేది స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లాంటిది. ఏ జట్టుకు ఎప్పుడు ల్యాడర్ తగులుతుందో..? ఎప్పుడు దేన్ని పాము మింగేస్తుందో.?

Eng Vs Pak: చేతిలో 3 వికెట్లు.. విజయానికి 5 పరుగులు.. కట్ చేస్తే.. ఊహించని షాకిచ్చిన పాక్!
Pakistan Bags Thrilling Win
Follow us on

క్రికెట్ అనేది స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లాంటిది. ఏ జట్టుకు ఎప్పుడు ల్యాడర్ తగులుతుందో..? ఎప్పుడు దేన్ని పాము మింగేస్తుందో.? ఎవ్వరూ చెప్పలేరు.. అందుకే చాలా సందర్భాల్లో మనం ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు చూడవచ్చు. ఈ కోవలోనే తాజాగా లాస్ట్ బాల్ థ్రిల్లర్ మ్యాచ్‌ ఒకటి జరిగింది. అందులో పాకిస్థాన్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. కరాచీ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం చివరి వరకు దోబూచులాడింది. ఒకానొక సందర్భంలో ఇంగ్లాండ్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు.. అయితే సీన్ కట్ చేస్తే.. చివరికి విజయం పాకిస్తాన్‌ను వరించింది. మరి అంతలా టేబుల్‌ను బాబర్ అజామ్ అండ్ కో ఎలా టర్న్ చేశారో ఇప్పుడు చూద్దాం..

ఓటమిని తిప్పికొట్టిన పాకిస్థాన్..

చివరి 10 బంతుల్లో ఇంగ్లాండ్ 5 పరుగులు చేయాలి. ఇది పెద్ద కష్టమైన టాస్క్ ఏం కాదు.. అంతేకాదు చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. దీంతో అందరూ కూడా ఇంగ్లాండ్‌దే విజయం అనుకున్నారు. కాని పాకిస్తాన్ జట్టు సీన్ మొత్తం మార్చేసింది. పాక్ విజయంలో హారిస్ రూఫ్ కీలక పాత్ర పోషించాడు.

హారిస్ రూఫ్ తన 19వ ఓవర్లో వెనువెంటనే వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి డాసన్ ఫోర్ కొట్టి ఇంగ్లాండ్‌ను విజయానికి ఒక అడుగు దగ్గర చేయగా.. వెంటనే మూడో బంతికి రూఫ్.. డాసన్(34)ను క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత నాలుగో బంతికి స్టోన్(0) గోల్డెన్ డకౌట్.. అనంతరం ఓవర్ చివరి రెండు బంతుల్లో కేవలం 1 రన్ మాత్రమే వచ్చింది. దీంతో రూఫ్ తన ఆఖరి ఓవర్‌లో కేవలం 5 పరుగులు ఇవ్వడమే కాదు.. కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు.

లాస్ట్ ఓవర్.. కొట్టాల్సింది 4 పరుగులు.. టోప్లీ డైరెక్ట్ హిట్..

ఆట చివరి ఓవర్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్‌కు విజయం దక్కాలంటే 4 పరుగులు చేయాలి. చేతిలో ఒక వికెట్ మిగిలింది. మహ్మద్ వసీమ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి రన్ ఏం రాలేదు. ఇక రెండో బంతికి స్ట్రైక్‌లో ఉన్న టోప్లీని డైరెక్ట్ హిట్‌తో పెవిలియన్ చేర్చాడు షాన్ మసూద్. అంతే!.. పాకిస్థాన్ డగౌట్‌లో కేరింతలు.. బాబర్ అజామ్ అండ్ కో.. నాలుగో టీ20లో అద్భుత విజయాన్ని సాధించింది.

ఎవరూ నమ్మలేని మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ 167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అందుకోవడంలో చతికిలబడింది. 19.2 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్ 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..