
Hardik Pandya Marriage Rumors: గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నటి మహీకా శర్మతో హార్దిక్ పాండ్యా ప్రేమలో ఉన్నాడని, వీరిద్దరూ ఈ నెల 22వ తేదీన వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న హార్దిక్, తన ఆటతో పాటు వ్యక్తిగత నిర్ణయాలతోనూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఆయన పెళ్లి వార్త తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ పెళ్లి ప్రచారానికి నెటిజన్లు ఒక విచిత్రమైన కారణాన్ని కూడా జోడిస్తున్నారు. ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్ల భద్రత, ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దీని ప్రకారం పర్యటనల్లో ఆటగాళ్లతో పాటు వారి స్నేహితురాళ్లకు అనుమతి ఉండదు. కేవలం భార్యాపిల్లలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. ఈ నిబంధనల కారణంగానే హార్దిక్ పాండ్యా, మహీకా శర్మను విడిచి ఉండలేక త్వరగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కొందరు కథనాలు అల్లేశారు. వివాహం చేసుకుంటే ఆమెను అధికారికంగా తనతో పాటు ఉంచుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ నెల 22న ముహూర్తం ఖరారు చేసుకున్నారని ప్రచారం ఊపందుకుంది.
ఈ ప్రచారంపై హార్దిక్ పాండ్యా అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ కేవలం పుకార్లని, వాటిలో ఎలాంటి నిజం లేదని వారు కొట్టిపారేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తన పూర్తి దృష్టిని క్రికెట్ మ్యాచ్‌లపైనే పెట్టారని, జట్టును విజయపథంలో నడిపించడమే ఆయన లక్ష్యమని అభిమానులు చెబుతున్నారు. కొంతమంది కావాలనే క్లిక్‌ల కోసం, వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అధికారికంగా హార్దిక్ పాండ్యా గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయనంత వరకు ఇలాంటి అబద్ధపు వార్తలను నమ్మవద్దని క్రీడాభిమానులు కోరుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..