Happy Birthday Kapil Dev: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కపిల్ దేవ్ తన కెరీర్‌లో భారీ రికార్డులు సృష్టించాడు. ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేని కొన్ని రికార్డులు కూడా ఈ భారత దిగ్గజం ఖాతాలో ఉన్నాయి. కపిల్ దేవ్ ఈరోజు (6 జనవరి 2024) తన 65వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఏ భారతీయుడు కూడా బద్దలు కొట్టలేకపోయిన కొన్ని రికార్డుల గురించి ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా బౌలింగ్‌లో కపిల్ పేరిట ఓ ప్రత్యేక రికార్డు ఉంది..
టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్. అతని ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. కపిల్ దేవ్ 356 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 687 వికెట్లు తీశాడు. ఇక 24 సార్లు ఐదు వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ రెండుసార్లు 10 వికెట్ల చొప్పున పడగొట్టాడు. భారత ఫాస్ట్ బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. జహీర్ 303 మ్యాచుల్లో 597 వికెట్లు తీశాడు. ఈ వ్యవధిలో 12 సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు జావగల్ శ్రీనాథ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్‌గా 296 మ్యాచుల్లో 551 వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ కూడా తన కెరీర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. షమీ 245 మ్యాచ్‌లు ఆడి 448 వికెట్లు తీశాడు.
356 intl. matches 👌
9031 intl. runs 🙌
687 intl. wickets 👏India’s 1983 World Cup-winning Captain 🏆
Wishing the legendary @therealkapildev – #TeamIndia‘s greatest all-rounder – a very happy birthday 🎂👏 pic.twitter.com/2wDimcObNK
— BCCI (@BCCI) January 6, 2024
1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవడం గమనార్హం. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ కపిల్ అద్భుతంగా రాణించాడు. 131 టెస్టుల్లో 5248 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 8 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు సాధించాడు. కపిల్ 225 వన్డేల్లో 3783 పరుగులు చేశాడు. అతను ఈ ఫార్మాట్‌లో 1 సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు చేశాడు. కపిల్ వన్డేల్లో అత్యుత్తమ స్కోరు 175 పరుగులు. దేశవాళీ మ్యాచ్‌ల్లో కపిల్ దేవ్ రికార్డు కూడా బాగానే ఉంది. 310 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 335 వికెట్లు తీశాడు. దీంతో పాటు 5481 పరుగులు కూడా చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..