GT vs RR IPL Match Result: గుజరాత్ టైటాన్స్ తమ ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మిల్లర్ (68*), పాండ్యా (40*) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించడంతో గుజరాత్ విజయతీరాలకు చేరింది. దీంతో ఐపీఎల్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి గుజరాత్ విజయాన్ని అందుకుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లకు 188 పరుగులు చేసింది. జోన్ బట్లర్ కేవలం 56 బంతుల్లో 89 పరుగులు సాధించి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సామ్‌సన్ 47 పరుగులు చేశాడు. అయితే ఒక్క పడిక్కల్ (28) తప్ప మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఇక గుజరాత్ ఈ విజయంతో నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. అయితే రాజస్థాన్‌కు ఫైనల్‌కు చేరుకోవడానికి మరో అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరుల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించి వారితో రాజస్థాన్ తలపడనుంది. బుధవారం (మే 25)న ఈ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం క్లిక్ చేయండి..