GT vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో 51వ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో కీలక పోరు జరుగుతోంది. లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ 17 ఓవర్లలో 2 వికెట్లు నష్టానికి 195 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో గిల్ నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 43 బంతుల్లో 81 పరుగులు చేసి వృద్ధిమాన్ సాహా ఔటయ్యాడు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ప్రేరక్ మన్కడ్ చేతికి చిక్కాడు.
ప్రస్తుత సీజన్‌లో సాహా తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అతని కెరీర్‌లో ఇది 12వ హాఫ్ సెంచరీ. సాహా 43 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. 188 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.
Up, Up and Away!
Watch the two cracking sixes by @ShubmanGill ??#TATAIPL #GTvLSG pic.twitter.com/XUI27sY9X5
— IndianPremierLeague (@IPL) May 7, 2023
గిల్ ఈ సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గిల్ కెరీర్‌లో ఇది 18వ అర్ధ సెంచరీ. 29 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు.
వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్ మధ్య 142 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొంది. కేవలం 74 బంతుల్లో 142 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ భాగస్వామ్యాన్ని అవేష్ ఖాన్ బ్రేక్ చేశాడు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ప్రేరక్ మన్కడ్ చేతికి చిక్కాడు.