మనీ మ్యాటర్ గురూ.. మూడు మ్యాచ్‌లకు కోట్ల ఆదాయం.. దెబ్బకు ఆ పనికి ఎగనామం పెట్టేసిన క్రికెటర్!

దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన చిన్ననాటి గర్ల్‌ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను గత ఆదివారం వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వెనుక ఓ ఇంటరెస్టింగ్ స్టోరీ ఉందని తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సి ఉంది.

మనీ మ్యాటర్ గురూ.. మూడు మ్యాచ్‌లకు కోట్ల ఆదాయం.. దెబ్బకు ఆ పనికి ఎగనామం పెట్టేసిన క్రికెటర్!
Gujarat Titans

Updated on: Mar 14, 2024 | 9:42 PM

దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన చిన్ననాటి గర్ల్‌ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను గత ఆదివారం వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వెనుక ఓ ఇంటరెస్టింగ్ స్టోరీ ఉందని తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సి ఉంది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. బీపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడినందుకు గానూ.. ఏకంగా రూ. 1.25 కోట్లు చెల్లిస్తానని ఫార్చూన్ బరిషల్‌ జట్టు ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. ఆ క్యాష్ డీల్‌లో టెంప్ట్ అయ్యి.. మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.

ఫిబ్రవరి 26(ఎలిమినేటర్), ఫిబ్రవరి 28(క్వాలిఫైయర్ 2), మార్చి 1(ఫైనల్) తేదీల్లో మూడు మ్యాచ్‌లు ఫార్చూన్ బరిషల్‌ జట్టు తరపున ఆడాడు డేవిడ్ మిల్లర్. ఇక బీపీఎల్ 2024 విజేతగా ఫార్చూన్ బరిషల్‌ జట్టు నిలవడం విశేషం. ఈ క్రమంలోనే డేవిడ్ మిల్లర్ విషయాన్ని తాజాగా పాకిస్తాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ తెలిపాడు.

‘తాను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బిజీగా ఉండటం వల్ల బీపీఎల్ పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్ విజేత ఎవరన్నది నా ఫ్రెండ్‌ను అడగ్గా.. డేవిడ్ మిల్లర్ గురించి ఈ సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు’ అంటూ పేర్కొన్నాడు వసీం అక్రమ్. ఈ విషయాలను ది పెవిలియన్ షోలో వ్యూయర్స్‌తో పంచుకున్నాడు అక్రమ్. కాగా, ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు డేవిడ్ మిల్లర్.