Gujarat Titans vs Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్‌లో 62వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 189 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది.
నరేంద్ర మోడీ స్టేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. గుజరాత్ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101 పరుగులు) కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుత సీజన్‌లో సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
హైదరాబాద్ తరపున భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు తీశాడు.
బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు గుజరాత్ క్రీడాకారులు గులాబీ రంగు జెర్సీని ధరించారు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, టి నటరాజన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..