ఐపీఎల్ 2022లో భాగంగా డీవై పాటిల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. పంజాబ్ 16 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. రాజపక్స ఔటయ్యాడు.
పంజాబ్ కింగ్స్ ఆటగాడు శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. 39 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లకు 143 పరుగులు సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ప్రదీప్ (2) రూపంలో గుజరాత్ 7వ వికెట్‌ను కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 17.4 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టీం 7 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు సత్తా చాటుతూ, వరుసగా వికెట్లు పడగొడుతున్నారు.
రషీద్ ఖాన్(0) రూపంలో గుజరాత్ 6వ వికెట్‌ను కోల్పోయింది. రబడా బౌలింగ్‌లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయి, ఇబ్బందుల్లో కూరకపోయింది. దీంతో 16.3 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టీం 6 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు సత్తా చాటుతున్నారు.
రాహుల్ తెవాటియా(11) రూపంలో గుజరాత్ 5వ వికెట్‌ను కోల్పోయింది. రబడా బౌలింగ్‌లో జితేష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 16.2 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టీం 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు సత్తా చాటుతున్నారు.
15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. సుదర్శన్ 40, రాహుల్ తెవాటియా 7 పరుగులతో క్రీజులో నిలిచారు.
12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. సుదర్శన్ 23, రాహుల్ తెవాటియా 1 పరుగులతో క్రీజులో నిలిచారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాకులు తుగులుతున్నాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో తొలి బంతికే శుభ్మన్(9) తొలి వికెట్‌గా వెనుదిరగగా, 4 వ ఓవర్ 5వ బంతికి సాహా(21 పరుగులు, 17 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 6.2 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టీం 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు సత్తా చాటుతున్నారు.
ఆరు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. సుదర్శన్ 4, హార్దిక్ పాండ్యా 1 పరుగులతో క్రీజులో నిలిచారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాకులు తుగులుతున్నాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో తొలి బంతికే శుభ్మన్(9) రనౌట్, కాగా, 4 వ ఓవర్ 5వ బంతికి సాహా(21 పరుగులు, 17 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. దీంతో 4 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టీం 2 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది.
మూడు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ ఒక వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది. సాహా 13, సుదర్శన్ 0 పరుగులతో క్రీజులో నిలిచారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో తొలి బంతికే శుభ్మన్(9) రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. రిషీ ధావన్ అద్భుత ఫీల్డింగ్‌తో షాకవుతూ పెవిలియన్ చేరాడు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కీపర్), రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ
కీలక మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు విజయం అవసరం కాగా.. మరోసారి వారి ముందు గట్టి సవాల్ నిలిచింది. ముఖ్యంగా పంజాబ్ నోటి నుంచి రెండుసార్లు విజయాన్ని లాగేసుకున్న గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియాను త్వరగా తప్పించాలని జట్టు భావిస్తోంది. 2020లో రాజస్థాన్ నుంచి ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టడం ద్వారా పంజాబ్‌పై జట్టు విజయంలో తెవాటియా కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత అదే సీజన్‌లో చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తెవాటియా చివరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు బాది విజయానికి అవసరమైన 12 పరుగులు చేసింది.
ఈ సీజన్‌లో గుజరాత్, పంజాబ్‌లు రెండు వేర్వేరు విభాగాల్లో నిలిచాయి. గుజరాత్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో పంజాబ్‌తో సహా 8 విజయాలు సాధించింది. హైదరాబాద్‌తో జట్టుకు ఏకైక ఓటమి ఎదురైంది. దీంతో ఆ జట్టు 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.
మరోవైపు, పంజాబ్ కింగ్స్ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. ప్రారంభ రౌండ్‌లో మరికొన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది. కానీ, మళ్లీ నిలకడను సాధించలేకపోయింది. జట్టు 9లో 4 విజయాలు మాత్రమే సాధించి, 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.