ముంబై ఇండియన్స్(MI) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో ముంబైనే విజయం వరిచింది. ఐపీఎల్ 2022(IPL)లో భాగంగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.
ప్రస్తుతానికి ఈ ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 1 విజయం, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది.
గుజరాత్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఆరింటిలో విజయం సాధించి, కేవలం రెండింట్లో ఓడిపోయింది. లీగ్‌లో మొత్తం 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠగా సాగిని పోరులో చివరికి ముంబైనే విజయం వరించింది.
గుజరాత్ టైటాన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. తెవాటియా రనౌట్ అయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా రనౌట్ అయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ బ్యాట్ వికెట్లకు తదలడంతో ఔటయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సహా ఔటయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ మొదటి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు.
6 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టైటాన్స్ టీం 54 పరుగులు చేసింది. సాహా 37, శుభ్మన్ గిల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
4 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టైటాన్స్ టీం 29 పరుగులు చేసింది. సాహా 25, శుభ్మన్ గిల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 178 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 45, రోహిత్ శర్మ 43, సూర్యకుమార్ 13, తిలక్ వర్మ 21, పొలార్డ్ 4, టిమ్ డేవిడ్ 44 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక గుజరాత్ బౌలర్లలో జోసెఫ్ 1, రషీధ్ ఖాన్ 2, ఫెర్గ్యూసన్ 1, ప్రదీప్ 1 వికెట్ పడగొట్టారు.
డేనియల్ సామ్స్ (0) రూపంలో ముంబై ఇండియన్స్ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీం స్కోర్ 164 పరుగుల వద్ద డేనియల్స్ సామ్స్ పెవిలియన్ చేరాడు.
తిలక్ వర్మ (21 పరుగులు, 16 బంతులు, 2 ఫోర్లు) రూపంలో ముంబై ఇండియన్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీం స్కోర్ 156 పరుగుల వద్ద తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు.
18 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం నాలుగు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. తిలక్ వర్మ 17, టిం డేవిడ్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పొలార్డ్ (4) రూపంలో ముంబై ఇండియన్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీం స్కోర్ 119 పరుగుల వద్ద పొలార్డ్ పెవిలియన్ చేరాడు.
14 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం మూడు కోల్పోయి 119 పరుగులు చేసింది. తిలక్ వర్మ 9, కీరన్ పొలార్డ్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇషాన్ కిషన్ (45 పరుగులు, 29 బంతులు, 1 సిక్స్, 5 ఫోర్లు) రూపంలో ముంబై ఇండియన్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 111 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరాడు.
సూర్యకుమార్ యాదవ్ (13 పరుగులు, 11 బంతులు, 1 సిక్స్) రూపంలో ముంబై ఇండియన్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 99 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరాడు.
10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం ఒక వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 39, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రోహిత్ శర్మ(43 పరుగులు, 28 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో ముంబై ఇండియన్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. దీంతో 74 పరుగుల వద్ద రోహిత్ పెవిలియన్ చేరాడు.
5 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం వికెట్లేమీ కోల్పోకుండా 53 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 37, ఇషాన్ కిషన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం వికెట్లేమీ కోల్పోకుండా 29 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 24, ఇషాన్ కిషన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈరోజు గుజరాత్‌తో ముంబై టీం తలపడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవడంతో ముంబై టీం నిరాశగా బరిలోకి దిగనుంది. కాగా, తండ్రి రోహిత్ శర్మ జట్టుకు మద్దతుగా తల్లి రితికా సజ్జాద్‌తోపాటు కుమార్తే ఖుదే సమైరా కూడా బ్రబౌర్న్ స్టేడియానికి బయలుదేరింది.
The Blue & Gold threads never looked cuter ?
Paltan, Sammy ke saath cheer karne taiyyar? ?#OneFamily #DilKholKe #MumbaiIndians #GTvMI @ImRo45 MI TV pic.twitter.com/ci69MCVdp0
— Mumbai Indians (@mipaltan) May 6, 2022
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(సారథి), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ప్రదీప్ సాంగ్వాన్, లాకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్
ముంబైతో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్ టీం టాస్ గెలిచింది. దీంతో తొలుత ముంబై ఇండియన్స్ టీం బ్యాటింగ్ చేయనుంది.
ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వరుసగా ఎనిమిది ఓటముల తర్వాత ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. కానీ, రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై ఐదు వికెట్ల విజయాన్ని నమోదు చేసిన తర్వాత టోర్నమెంట్‌లో తమ మొదటి విజయాన్ని నమోదు చేయడంతో ఊపిరి పీల్చుకుంది.
గుజరాత్ టైటాన్స్ తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడి, ఐదు మ్యాచ్‌ల విజయాల పరంపరకు బ్రేక్ పడింది. నేటి మ్యాచ్‌లో విజయంతో 18 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించేందుకు బరిలోకి దిగనుంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ ఈరోజు ఐపీఎల్‌లో ఇప్పటికే రేసులో ఉన్న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.