ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా పుణేలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మ్యాచ్‌లో గుజరాత్ 14 తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవరల్లో ఆరు వికెట్లో కోల్పోయి 171 పరుగులు చేసింది. ఛేదన ప్రారంభించిన ఢిల్లీ ఐదు ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ పంత్, లలిత్ యాదవ్ నిలబడడంతో ఆ జట్టు కాస్త కోలుకుంది. లలిత్ రనౌట్ అవడంతో ఢిల్లీ మళ్లీ కష్టాల్లో పడింది. అయితే అతను రనౌట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ విజయ్ శంకర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని పంత్ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. సింగిల్ కోసం ముందుకు కదిలాడు. కానీ బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో ఆగిపోయాడు. పరుగు కోసం నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న లలిత్ యాదవ్ ముందుకు వచ్చి వెనక్కు వెళ్లాడు. కాగా బంతిని అందుకున్న మనోహర్.. విజయ్ శంకర్‌కు త్రో విసిరాడు. లలిత్ యాదవ్ క్రీజులోకి చేరేలోపే విజయ్ శంకర్ వికెట్లను గిరాటేశాడు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతి అందుకోవడానికి ముందే విజయ్ శంకర్ తన కాలితో పొరపాటున వికెట్లను తన్నడంతో ఒక బెయిల్ కిందపడింది. అప్పటికే బంతి విజయ్ శంకర్ చేతిలో పడడం.. వెంటనే వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. రిప్లేలో విజయ్ శంకర్ పొరపాటున ముందే వికెట్లను తన్నినప్పటికి.. లలిత్ యాదవ్‌ను రనౌట్ చేసే సమయానికి బంతి అతని చేతిలోనే ఉందని.. కాబట్టి అది ఔటేనని ఎంపైర్లు వివరించారు. దీంతో చేసేదేం లేక లలిత్ యాదవ్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
— Srinivasgoud (@Sriniva88298521) April 3, 2022
Read Also.. GT vs DC Result, IPL 2022: నాలుగు వికెట్లతో చెలరేగిన ఫెర్గూసన్.. ఢిల్లీపై గెలిచిన గుజరాత్ టైటాన్స్..