
అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 204 పరుగుల టార్గెట్‌ను కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి.. మరో 4 బంతులు ఉండగానే చేధించింది. ఈ రన్ ఛేజ్‌లో గుజరాత్ బ్యాటర్ జాస్ బట్లర్(97 నాటౌట్) అజేయంగా నిలిచాడు. అతడు మొత్తంగా 54 బంతులు ఎదుర్కుని.. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేశాడు. క్రీజులో ఒక ఎండ్ పాతుకుపోయి.. పరుగుల వరద పారించాడు. టీ20ల్లో జాస్ ది బాస్ అని మళ్లీ సత్తా చాటాడు. ఇక ఇప్పటిదాకా బట్లర్ 7 మ్యాచ్‌లు ఆడి.. 32 ఫోర్లు, 13 సిక్సర్లతో 315 పరుగులు చేశాడు. అత్యధిక రన్ స్కోరర్ల లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు.
వాస్తవానికి గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగాడు జాస్ బట్లర్. అయితే అతడ్ని మెగా వేలానికి ముందు రిలీజ్ చేసింది రాయల్స్ ఫ్రాంచైజీ. ఇక ఆ తర్వాత ఆక్షన్‌లో రూ. 15 .75 కోట్లు పెట్టి గుజరాత్ టైటాన్స్ జాస్ బట్లర్‌ను కొనుగోలు చేసింది. వన్ డౌన్‌లో బ్యాటింగ్ చేసిన జాస్ బట్లర్.. గుజరాత్‌కి కీలక బ్యాటర్‌గా మారాడు. 54, 39, 73, 0, 36, 16, 97.. రెండు మ్యాచ్‌లు మినహా.. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచ్‌లలో ఐదింట విజయం సాధించి.. రెండింట మాత్రం ఓడిపోయే.. 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది గుజరాత్ టైటాన్స్.
𝐒𝐭𝐚𝐦𝐩ing our authority with yet another win in #TATAIPL2025! 💪 pic.twitter.com/8lQzTDvKQq
— Gujarat Titans (@gujarat_titans) April 20, 2025