T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‎కు ముందు పాకిస్తాన్‌‎కు షాక్.. జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్ రాజీనామా..

|

Oct 15, 2021 | 8:27 PM

టీ 20 వరల్డ్ కప్‎కు ముందు పాకిస్తాన్ క్రికెట్‎ బోర్డుకు షాకిచ్చాడు ఆ జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచ్, న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాంట్ బ్రాడ్‌బర్న్. తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు...

T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‎కు ముందు పాకిస్తాన్‌‎కు షాక్.. జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్ రాజీనామా..
Pak
Follow us on

టీ 20 వరల్డ్ కప్‎కు ముందు పాకిస్తాన్ క్రికెట్‎ బోర్డుకు షాకిచ్చాడు ఆ జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచ్, న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాంట్ బ్రాడ్‌బర్న్. తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శుక్రవారం ఈ విషయం ప్రకటించింది. అతను సెప్టెంబర్ 2018 నుండి జూన్ 2020 వరకు జాతీయ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పాకిస్థాన్ క్రికెట్‌కు సేవలు అందించారు. “పాకిస్తాన్‌కు సేవ చేయడానికి అవకాశం కల్పించిన పీసీపీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతు ఇచ్చిన ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ టెస్ట్ కెప్టెన్ రమీజ్ రాజా పీసీబి చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాక్ జట్టులో పనిచేస్తున్న అత్యన్నతస్థాయి వ్యకులు రాజీమానా చేశారు. అందులో బ్రాడ్‌బర్న్ ఐదో వ్యక్తి నిలిచారు.

రమీజ్ ఎన్నికైన వెంటనే, పాకిస్తాన్ జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ రాజీనామా చేశారు. తరువాత సీఈవో వసీం ఖాన్, మార్కెటింగ్ అధిపతి బాబర్ హమీద్ రాజీనామా చేశారు. కోవిడ్ -19 నిబంధనల వల్ల తన కుటుంబంతో గడపడం కష్టమైందని బ్రాడ్‌బర్న్ అన్నారు. “ఒక విదేశీయుడిగా, నా ప్రస్తుత మాజీ పీసీబీ సహచరులు, ఆటగాళ్లు, అధికారులు, పాకిస్తాన్ ప్రజలు నన్ను స్వాగతించారు. గౌరవించారు. నేను ఎల్లప్పుడూ ఇక్కడ సురక్షితంగా ఉన్నాను.”అని చెప్పాడు. గ్రాంట్ న్యూజిలాండ్ తరఫున 1990 నుంచి 2001 వరకు ఏడు టెస్టులు,11 వన్డేలు ఆడాడు. బ్రాడ్‌బర్న్ న్యూజిలాండ్ A , న్యూజిలాండ్ అండర్-19 కోచ్‌గా కూడా పనిచేశాడు.

Read Also.. Jai Bhim: “బాధింపబడ్డ వారికి లభించని న్యాయం.. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది”