India vs West Indies: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2023) ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత, భారత జట్టుకు ఇప్పుడు దాదాపు ఒక నెల సుదీర్ఘ విరామం లభించింది. తాజాగా, వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా తదుపరి అంతర్జాతీయ సిరీస్ ఆడాల్సి ఉంది. ఆతిథ్య జట్టు కరేబీయన్ జట్టుతో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను జులై 12 నుంచి టీమిండియా ప్రారంభించనుంది. జియో సినిమాస్ తన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో వెస్టిండీస్ పర్యటన కోసం ప్రత్యక్ష ప్రసార హక్కులను పొందింది.
డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోవడంతో పాటు, జియో సినిమాస్ కూడా అభిమానుల కోసం కీలక ప్రకటన చేసింది. జియో సినిమాస్ సిరీస్ అంతటా మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయనుంది. అంతేకాకుండా, అభిమానులు Jio సబ్‌స్క్రైబర్లు కాకపోయినా ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
ఐపీఎల్ 16వ సీజన్‌లో జియో సినిమాస్‌లో మాత్రమే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు, అభిమానులు వెస్టిండీస్ పర్యటన వ్యాఖ్యానాన్ని భోజ్‌పురి, పంజాబీ, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో వినవచ్చు. IPL డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడానికి Jio సినిమా US$ 2.9 బిలియన్ చెల్లించిందంట. సీజన్ మొత్తంలో డిజిటల్ టెలికాస్ట్‌ల సమయంలో జియో సినిమాస్ దాదాపు 1700 కోట్ల వీక్షణలను అందుకుంది.
Ash to 🔥 against the Windies once again and make history? 🧐#SabJawabMilenge in India’s tour of West Indies, streaming FREE on #JioCinema 🙌#WIvIND pic.twitter.com/uejB71YW01
— JioCinema (@JioCinema) July 7, 2023
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త ఎడిషన్ జులై 12 నుంచి వెస్టిండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ డొమినికాలో జరగనుంది. కాగా, సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ జులై 20 నుంచి ట్రినిడాడ్‌లో జరగనుంది. టెస్టులు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి.
టెస్టు సిరీస్ తర్వాత ఇరు జట్లు జులై 27 నుంచి ఆగస్టు 1 వరకు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఆగస్టు 3 నుంచి ఆగస్టు 13 మధ్య 5టీ20ఐల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో చివరి 2 టీ20ఐ మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..