Glenn Maxwell: విరాట్‌ కోహ్లీ ఇప్పుడు చాలా డేంజర్.. ప్రత్యర్థి జట్లకి చాలా ప్రమాదకరం..!

|

Mar 18, 2022 | 5:46 AM

Glenn Maxwell: విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా పరుగులు సాధించాలని తహతహలాడుతున్నాడు. ఇప్పుడు అతని నుంచి పెద్ద భారం తొలగిపోయింది. దీంతో అతను ఫామ్‌లోకి వచ్చే అవకాశాలు

Glenn Maxwell: విరాట్‌ కోహ్లీ ఇప్పుడు చాలా డేంజర్.. ప్రత్యర్థి జట్లకి చాలా ప్రమాదకరం..!
Glenn Maxwell
Follow us on

Glenn Maxwell: విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా పరుగులు సాధించాలని తహతహలాడుతున్నాడు. ఇప్పుడు అతని నుంచి పెద్ద భారం తొలగిపోయింది. దీంతో అతను ఫామ్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. అందుకే అతని పటిష్ట బ్యాటింగ్‌ను అందరూ చూడాలనుకుంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ ఇదే విషయాన్ని వెల్లడించాడు. ‘విరాట్ కోహ్లీ ప్రస్తుతం కెప్టెన్సీ భారం లేకుండా ఫ్రీగా ఉన్నాడు. ఇది రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రత్యర్థి జట్లకు చాలా ప్రమాదకరం’ గతేడాది ఐపీఎల్ తర్వాత కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సమయంలోనే జాతీయ టీ20, టెస్టు జట్ల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. RCB పోడ్‌కాస్ట్‌లో మాక్స్‌వెల్ ఇలా అన్నాడు..’ కోహ్లీ కెప్టెన్ బాధ్యతను వదులుకున్నాడని అందరికి తెలుసు. బహుశా అది అతనికి పెద్ద భారం అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు అతను దాని నుంచి విముక్తి పొందాడు. బహుశా ఇది ప్రత్యర్థి జట్టుకు ప్రమాదకరమైన వార్త’ అని తెలిపాడు. “అతను కొంచెం ఉపశమనం పొందడం చాలా అద్భుతంగా ఉంటుంది. అతను తన కెరీర్‌లో రాబోయే కొన్ని సంవత్సరాలు ఎటువంటి బాహ్య ఒత్తిడి లేకుండా ఆనందించగలడు” అని చెప్పాడు.

RCB కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను నియమించింది. కోహ్లి నిజంగా ఎంజాయ్ చేసే దశలో ఉన్నాడని ఆస్ట్రేలియా దూకుడు బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్ సంతోషం వ్యక్తం చేశాడు. కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. ఎప్పుడూ గేమ్‌పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తాడు. ఏది ఏమైనప్పటికీ భారత మాజీ కెప్టెన్ తనకు సన్నిహితుడిగా మారడం ఆశ్చర్యంగా ఉందని మ్యాక్స్‌వెల్ చెప్పాడు.

Holi 2022: సేంద్రియ రంగులతో హోలీ ఆడండి.. పర్యావరణాన్ని కాపాడండి..

Holi 2022: విచిత్ర సంప్రదాయం.. హోలీ రోజు కొత్త అల్లుడిని గుర్రంపై ఊరేగిస్తారు..!

Hyderabad: జూబ్లీహిల్స్‌ రోడ్డులో కారు బీభత్సం.. రెండున్నరేళ్ల బాబు అక్కడికక్కడే మృతి