
Glenn Maxwell Fastest T20 century in MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 సీజన్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి తన “బిగ్ షో”తో ఆకట్టుకున్నాడు. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి, జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ 13 భారీ సిక్సర్లతో పాటు 2 ఫోర్లు బాదాడు.
ఈ మొత్తం ఇన్నింగ్స్ 49 బంతుల్లోనే జరిగింది. దీనిలో అతను 216.32 స్ట్రైక్ రేట్, 13 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 48వ బంతికి తన సెంచరీని పూర్తి చేశాడు. గ్లెన్ మాక్స్వెల్ తన T20 కెరీర్‌లో సెంచరీ సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం ఇది 8వ సారి.
మ్యాచ్ ప్రారంభంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్, మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడాడు. ఒక దశలో 15 బంతుల్లో కేవలం 11 పరుగులే చేసి, అభిమానులను ఆందోళనకు గురిచేశాడు. అయితే, క్రీజ్‌లో కుదురుకున్న తర్వాత మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో విధ్వంసం సృష్టించాడు. కానీ ఆ తరువాతి 34 బంతుల్లో మిగిలిన 95 పరుగులు సాధించాడు. లాస్ ఏంజిల్స్ బౌలర్లను పరుగులు కోసం చెల్లాచెదురు చేశాడు. గ్రౌండ్ నలుమూలలా బౌండరీలను బాదేసి పరుగులను పిండుకున్నాడు.
ప్రత్యేకించి, ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో మ్యాక్స్‌వెల్ విధ్వంసం తారాస్థాయికి చేరింది. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఏకంగా 26 పరుగులు పిండుకోవడంతో, మ్యాక్స్‌వెల్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మెరుపు సెంచరీతో అతను తన టీ20 కెరీర్‌లో ఎనిమిదో శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్ శర్మ, జోస్ బట్లర్ వంటి దిగ్గజాలతో కలిసి ఈ జాబితాలో నిలిచాడు.
An insane Glenn Maxwell hundred in the MLC!
He went from 11 off 15 … to 106 off 49!
Full highlights coming in just minutes 👀 pic.twitter.com/zwcpjnyAls
— 7Cricket (@7Cricket) June 18, 2025
ఇటీవలే వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మాక్స్వెల్, IPL 2025లో బ్యాటింగ్ తో అంత బాగా రాణించలేదు. కానీ, MLC 2025లో, అతను ఆటగాడిగా మాత్రమే కాకుండా జట్టు కెప్టెన్‌గా కూడా తన విధులను నిర్వర్తిస్తున్నాడు. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్‌కు కీలకమైన స్కోరును అందించింది. ఒకానొక దశలో 200 పరుగులు కూడా కష్టమే అనుకున్న చోట, మ్యాక్స్‌వెల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు స్కోరును 20 ఓవర్లలో 208/5కు చేర్చాడు. ఈ భారీ స్కోరుతో వాషింగ్టన్ ఫ్రీడమ్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేయగలిగింది.
ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఇది అతని అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లలో కూడా అతను మంచి ప్రదర్శనలు కనబరిచినా, ఈ సెంచరీ మాత్రం అతని ఫామ్‌ను, విధ్వంసక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. ఈ ప్రదర్శనతో మ్యాక్స్‌వెల్ MLCలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు. తన తల్లిదండ్రుల సమక్షంలో ఈ సెంచరీ సాధించడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు.
మొత్తంగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ MLC 2025లో తన విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను అలరించడమే కాకుండా, వాషింగ్టన్ ఫ్రీడమ్‌కు కీలక విజయాన్ని అందించాడు. అతని ఈ సెంచరీ, రాబోయే మ్యాచ్‌లలో కూడా అతని నుంచి ఇలాంటి మెరుపు ప్రదర్శనలను ఆశించేలా చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..