కోహ్లీపై కుట్ర..? అలా చేస్తే డబ్బులిస్తామంటూ జర్మన్ మోడల్‌కు బంపర్ ఆఫర్!

Virat Kohli Instagram controversy: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుని కొందరు భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. కోహ్లీపై అసత్య ఆరోపణలు చేసేందుకు తనకు భారీ మొత్తంలో నగదు ఆశ చూపారని జర్మన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లీజ్ లాజ్ సంచలన నిజాలను వెల్లడించారు. ఈ పరిణామం ప్రస్తుతం క్రీడా, సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతోంది.

కోహ్లీపై కుట్ర..? అలా చేస్తే డబ్బులిస్తామంటూ జర్మన్ మోడల్‌కు బంపర్ ఆఫర్!
Lizlaz German Influencer Kohli Claims

Updated on: May 12, 2026 | 4:28 PM

Virat Kohli Instagram controversy: కొద్దిరోజుల క్రితం లిజ్ లాజ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేశారంటూ స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అయితే, ఈ చిన్న విషయాన్ని అడ్డుపెట్టుకుని కోహ్లీ ప్రతిష్టను దెబ్బతీయాలని కొందరు ప్రయత్నించినట్లు లిజ్ తాజాగా బాంబు పేల్చారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అసలు ఏం జరిగింది? వివాదం నేపథ్యం..

కొద్దిరోజుల క్రితం లిజ్ లాజ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేశారంటూ స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అయితే, ఈ చిన్న విషయాన్ని అడ్డుపెట్టుకుని కోహ్లీ ప్రతిష్టను దెబ్బతీయాలని కొందరు ప్రయత్నించినట్లు లిజ్ తాజాగా బాంబు పేల్చారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆసియా ఖండపు మెస్సీ, రొనాల్డో కోహ్లీ!

విరాట్ కోహ్లీని లిజ్ ఆకాశానికెత్తారు. “కోహ్లీ ఆసియా ఖండానికి మెస్సీ, రొనాల్డో లాంటి వారు. అటువంటి గొప్ప క్రీడాకారుడిపై బురద చల్లడం తప్పు” అని ఆమె పేర్కొన్నారు. కేవలం ఒక ‘లైక్’ను వివాదం చేయడం సరికాదని, కోహ్లీ ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని ఆమె ఆయనకు మద్దతుగా నిలిచారు.

కుట్రల వెనుక ఎవరున్నారు?

కోహ్లీ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ఆటగాడిని లక్ష్యంగా చేసుకుని డబ్బుతో నోరు నొక్కే ప్రయత్నం చేయడం వెనుక ఎవరి హస్తం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వివాదం తర్వాత లిజ్‌కు భారత్‌లో విపరీతమైన గుర్తింపు రావడమే కాకుండా, పలు బ్రాండ్ ఒప్పందాలు, రియాలిటీ షో ఆఫర్లు కూడా క్యూ కట్టినట్లు సమాచారం. అయినప్పటికీ, తన విలువలకు కట్టుబడి ఉంటానని ఆమె చాటిచెప్పారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us