Team India: కోచ్‌గా గంభీర్ ఎక్కువ కాలం ఉండడు: బిగ్ షాక్ ఇచ్చిన ధోని దోస్త్

|

Aug 04, 2024 | 12:09 PM

Gautam Gambhir - Joginder Sharma: గౌతమ్ గంభీర్ ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్. శ్రీలంక పర్యటనతో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయడంతో గౌతమ్ గంభీర్ తన కోచ్ కెరీర్‌ను విజయంతో ప్రారంభించాడు. అయితే, వీటన్నింటి మధ్య టీమిండియా ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఓ మాజీ ఆటగాడు చేసిన షాకింగ్ స్టేట్‌మెంట్ వైరల్ అవుతోంది.

Team India: కోచ్‌గా గంభీర్ ఎక్కువ కాలం ఉండడు: బిగ్ షాక్ ఇచ్చిన ధోని దోస్త్
Gautam Gambhir
Follow us on

Gautam Gambhir – Joginder Sharma: గౌతమ్ గంభీర్ ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్. శ్రీలంక పర్యటనతో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయడంతో గౌతమ్ గంభీర్ తన కోచ్ కెరీర్‌ను విజయంతో ప్రారంభించాడు. అయితే, వీటన్నింటి మధ్య టీమిండియా ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఓ మాజీ ఆటగాడు చేసిన షాకింగ్ స్టేట్‌మెంట్ వైరల్ అవుతోంది. అతని ప్రకారం, గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియాను నిర్వహించగలడు. అయితే ఇక్కడ కోచ్‌గా ఎక్కువ కాలం కొనసాగలేడని అభిప్రాయపడ్డాడు.

గౌతమ్ గంభీర్ కోచింగ్ కెరీర్‌ను 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ అంచనా వేశాడు. అప్పుడు గంభీర్ సహచరుడిగా ఉన్న జోగీందర్ ఇప్పుడు ఆశ్చర్యకరమైన ప్రకటనతో దృష్టిని ఆకర్షించాడు.

జోగిందర్ చెప్పిన కారణాలు..

టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎక్కువ కాలం కొనసాగకపోవడానికి జోగీందర్ శర్మ మూడు కారణాలను చెప్పాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా మందికి నచ్చవు. ఎందుకంటే సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. నేరుగా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది.
  • గౌతమ్ గంభీర్ ఎవరి జోలికి వెళ్లడు. ఇతరులతో కలిసిపోయే అలవాటు లేదు. కాబట్టి ఇది కూడా సమస్యను సృష్టిస్తుంది.
  • గౌతమ్ గంభీర్ తన పనిని నమ్ముతాడు. కానీ, అతను దాని క్రెడిట్ తీసుకునే వ్యక్తి కాదు. అందుకే టీమిండియా కోచ్‌గా ఎక్కువ కాలం కొనసాగడని జోగీందర్ శర్మ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..