
World Cup 2023 IND vs PAK: ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ కోసం మొత్తం 48 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. మొత్తం 10 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచకప్‌లో సెమీస్ చేరే టీంలపై టీమిండియా ఆల్ రౌండర్ దినేష్ కార్తీక్ జోస్యం చెప్పాడు. ఈసారి సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్ల పేర్లను కార్తీక్ తెలిపాడు. భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుకోగలవని చెప్పుకొచ్చాడు.
ఈసారి ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొననుంది. కాగా, వన్డే ప్రపంచకప్ 2019ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో సూపర్ ఓవర్‌లో ఆ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈసారి కూడా ఇంగ్లండ్ టైటిల్‌కు పోటీదారుగా బరిలోకి దిగనుంది. వీటితో పాటు పాకిస్థాన్ లేదా దక్షిణాఫ్రికా కూడా ఈ జాబితాలో చేరవచ్చని అన్నాడు.
విశేషమేమిటంటే, భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్, శ్రీలంక మాజీ ఆటగాడు మురళీధరన్ కూడా సెమీ-ఫైనల్‌కు చేరుకోగల జట్లను పేర్కొనడం గమనార్హం. భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుకోగలవని వారిద్దరూ ప్రకటించారు. సెహ్వాగ్ ప్రకారం, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ఉండవచ్చని తెలిపాడు. ఇక మురళీధరన్ ప్రకారం, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఉంటుందని ప్రకటించాడు.
కాగా, భారత జట్టు మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8 న చెన్నైలో జరగనుంది. అదే సమయంలో అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..