Four Wicketkeepers: ఒకే టెస్టులో నలుగురు వికెట్‌కీపర్లు.. క్రికెట్ హిస్టరీలోనే విచిత్ర ప్రయోగం..!

Four wicketkeepers in one Test: వికెట్‌కీపర్‌ గాయం సాధారణంగా జట్టుకు పెద్ద సమస్యే. కానీ 1986 లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌ ఎదుర్కొన్న పరిస్థితి మరింత విచిత్రంగా మారింది. ఒకే మ్యాచ్‌లో నలుగురు కీపర్లు మారడం టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది.

Four Wicketkeepers: ఒకే టెస్టులో నలుగురు వికెట్‌కీపర్లు.. క్రికెట్ హిస్టరీలోనే విచిత్ర ప్రయోగం..!
Four Wicketkeepers

Updated on: Aug 27, 2026 | 7:00 AM

Four wicketkeepers in one Test: ఒక టెస్టు మ్యాచ్‌లో సాధారణంగా ఒక వికెట్‌కీపర్‌ మాత్రమే గ్లౌజులు ధరిస్తాడు. గాయమైతే మరో ఆటగాడు ఆ బాధ్యత తీసుకుంటాడు. కానీ ఇంగ్లండ్‌ టెస్టు చరిత్రలో ఒకసారి ఏకంగా నలుగురు వికెట్‌కీపర్లు మారుతూ కీపింగ్‌ చేశారు. అసలు ఎందుకిలా జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

లార్డ్స్‌లో చోటుచేసుకున్న అరుదైన ఘటన..

1986లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జులై 24 నుంచి 29 వరకు జరిగిన ఈ పోరులో ఇంగ్లండ్‌ ఏకంగా నలుగురు వేర్వేరు వికెట్‌కీపర్లను ఉపయోగించింది. బ్రూస్‌ ఫ్రెంచ్‌, బిల్‌ ఏథీ, బాబ్‌ టేలర్‌, బాబీ పార్క్స్‌ వేర్వేరు సమయాల్లో వికెట్ల వెనుక బాధ్యతలు నిర్వర్తించారు. అసలు ఈ మార్పులన్నింటికీ కారణం ఇంగ్లండ్‌ ప్రధాన వికెట్‌కీపర్‌ బ్రూస్‌ ఫ్రెంచ్‌కు ఎదురైన గాయమే. అతడు బ్యాటింగ్‌ చేస్తుండగా తీవ్రంగా గాయపడి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?

ఇవి కూడా చదవండి

రిటైర్‌ అయిన ఆటగాడు మళ్లీ గ్లౌజులు..

ఆ సమయంలో ఇంగ్లండ్‌ జట్టులో అదనపు వికెట్‌కీపర్‌ లేడు. దీంతో అనూహ్యంగా బాబ్‌ టేలర్‌ పేరు తెరపైకి వచ్చింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన టేలర్‌ అప్పటికి మ్యాచ్‌ స్పాన్సర్‌ హోస్ట్‌గా హాస్పిటాలిటీ టెంట్‌లో ఉన్నాడు. పరిస్థితి కారణంగా అతడిని మైదానంలోకి తీసుకొచ్చి కీపింగ్‌ చేయించారు.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభం ఆలస్యం కావడంతో తొలి రెండు ఓవర్లు బిల్‌ ఏథీ కీపింగ్‌ చేశాడు. ఆ తర్వాత టేలర్‌ గ్లౌజులు అందుకున్నాడు. రెండో రోజు, మూడో రోజు ఆరంభం వరకు అతడే వికెట్ల వెనుక ఉన్నాడు.

చివరికి నాలుగో కీపర్‌ కూడా..

తర్వాత ఇంగ్లండ్‌ మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంది. అప్పట్లో దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్న బాబీ పార్క్స్‌ను జట్టులో ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా తీసుకుని బాధ్యత అప్పగించారు.

ఎక్కువమంది చదివినది: ఎవర్రా మీరు.. నో బాల్ కాదు.. వైడ్ కూడా కాదు.. కట్‌చేస్తే.. ఒకే బంతికి ఏకంగా 7 పరుగులు..!

కథ ఇక్కడితో ముగియలేదు. మ్యాచ్‌ చివరి రోజు బ్రూస్‌ ఫ్రెంచ్‌ గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలోకి వచ్చాడు. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అతడే మళ్లీ వికెట్‌కీపింగ్‌ చేశాడు. దీంతో ఒకే టెస్టులో బ్రూస్‌ ఫ్రెంచ్‌, బిల్‌ ఏథీ, బాబ్‌ టేలర్‌, బాబీ పార్క్స్‌ అంటూ నలుగురు ఆటగాళ్లు వికెట్ల వెనుక బాధ్యతలు చేపట్టిన అరుదైన ఘటన నమోదైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us