ICC Banned: అవినీతికి పాల్పడిన స్టార్ క్రికెటర్.. కట్‌చేస్తే.. 6 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ.. ఎవరంటే?

Marlon Samuels West Indies: ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు శామ్యూల్స్ దోషిగా తేల్చింది. ఐసీసీ హెచ్‌ఆర్ అండ్ ఇంటెగ్రిటీ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షన్ గురువారం ఈ నిషేధాన్ని ప్రకటించారు. శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్నాడని తెలిపాడు.

ICC Banned: అవినీతికి పాల్పడిన స్టార్ క్రికెటర్.. కట్‌చేస్తే.. 6 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ.. ఎవరంటే?
Icc New Rules

Updated on: Nov 23, 2023 | 12:54 PM

Marlon Samuels Banned: వెటరన్ వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌పై ఐసీసీ ఆరేళ్ల నిషేధం విధించింది. శామ్యూల్స్ వెస్టిండీస్ తరపున చాలా సందర్భాలలో అద్భుత ప్రదర్శన చేశాడు. రిటైర్మెంట్ తర్వాత దేశవాళీ లీగ్‌లలో ఆడుతున్నాడు. అయితే, ఇప్పుడు అవినీతికి పాల్పడినందుకు ఆయనపై నిషేధం విధించింది. శామ్యూల్స్ వచ్చే ఆరేళ్లపాటు ఏ ఫార్మాట్‌లోనూ ఆడలేరు.

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు శామ్యూల్స్ దోషిగా తేల్చింది. ఐసీసీ హెచ్‌ఆర్ అండ్ ఇంటెగ్రిటీ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షన్ గురువారం ఈ నిషేధాన్ని ప్రకటించారు. శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్నాడని తెలిపాడు. ఈ క్రమంలో పలుమార్లు అవినీతి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అవినీతి నిరోధక బాధ్యత ఏమిటో ఆయనకు తెలుసు. ఆయన ప్రస్తుతం రిటైర్మెంట్ చేశాడు. అయితే నేరం జరిగినప్పుడు అతడు జట్టులో భాగమయ్యాడు అంటూ ఐసీసీ తెల్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..