T20 World Cup: క్యాచ్‌లు పట్టడం ఎప్పుడు నేర్చుకుంటారయ్యా? పాక్‌ క్రికెటర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం

|

Oct 28, 2022 | 11:49 AM

క్రికెట్‌లో క్యాచెస్‌ విన్స్‌ మ్యాచెస్‌ అనే సామెత ఉంటుంది. అయితే ఈ మాట పాక్ జట్టుకు ఏకీభవించదని జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ రుజువైంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు 3 సులభమైన క్యాచ్‌లు జారవిడిచారు.

T20 World Cup: క్యాచ్‌లు పట్టడం ఎప్పుడు నేర్చుకుంటారయ్యా? పాక్‌ క్రికెటర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం
Pakistan Cricket Team
Follow us on

T20 ప్రపంచ కప్‌లో పెర్త్ మైదానం వేదికగా మరో సంచలనం నమోదైంది. టోర్నీ ఫేవరెట్‌ జట్లలో ఒకటైన పాకిస్థాన్ జట్టు జింబాబ్వే చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. తేలిక పాటి లక్ష్యాన్ని కూడా ఛేదించలేని పాక్‌ ఒక పరుగు తేడాలో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు చేసిన ఫీల్డింగ్‌ తప్పిదాలే ఓటమికి కారణమని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తొలుత టాస్ ఓడి బౌలింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ సరిగా చేయలేదు. పేలవమైన ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా పాకిస్థాన్ పరుగు తేడాతో ఓడిపోయిందని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌లో క్యాచెస్‌ విన్స్‌ మ్యాచెస్‌ అనే సామెత ఉంటుంది. అయితే ఈ మాట పాక్ జట్టుకు ఏకీభవించదని జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ రుజువైంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు 3 సులభమైన క్యాచ్‌లు జారవిడిచారు. ఫలితంగా 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 129 పరుగులు చేసింది.

మ్యాచ్ 9వ ఓవర్‌లో షాహీన్ షా ఆఫ్రిది వేసిన షాట్‌ను మిడ్ వికెట్ వైపు షాట్ కొట్టాడు సీన్ విలియమ్స్. ముందు ఫీల్డింగ్‌లో ఉన్న ఇఫ్తికర్ అహ్మద్ సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు. దీని తర్వాత షాదాబ్ ఖాన్ వేసిన 14వ ఓవర్లో విలియమ్స్ మళ్లీ క్యాచ్‌ను వదిలేశాడు. ఇక మ్యాచ్ 19వ ఓవర్‌లో, డీప్ మిడ్ వికెట్ వద్ద ర్యాన్ బర్ల్ వేసిన సులభమైన క్యాచ్‌ను హైదర్ అలీ నేలపాలు చేశారు. ఈ క్యాచ్‌లు పట్టి ఉంటే మ్యాచ్‌ ఫలితం వేరేలా ఉండేదని పాక్‌ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పేలవమైన ఫీల్డింగ్‌కు పేరుగాంచిన పాక్ జట్టు కీలకమైన మ్యాచ్‌లలో క్యాచ్‌లు జారవిడించి భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గత టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో మాథ్యూ వేడ్‌ క్యాచ్‌ను జారవిడిచి ఏకంగా మ్యాచ్‌నే కోల్పోయింది. ఇప్పుడు జింబాబ్వే మ్యాచ్లోనూ క్యాచ్‌లు పట్టడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పాక్‌ ఆటగాళ్లు క్యాచ్‌లు పట్టడం ఎప్పుడు నేర్చుకుంటారని అభిమానులు అడుగుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. తేలిక పాటి లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు శుభారంభం దక్కలేదు. మిడిల్‌ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే జట్టు అద్భుతమైన ఫీల్డింగ్, చక్కటి బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించి పాక్ జట్టును 129 పరుగులకే ఆలౌట్ చేసి 1 పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. కాగా వరుసగా రెండు ఓటములతో ప్రపంచకప్‌లో పాక్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..