B. S. Chandrasekhar : టీమిండియా మాజీ క్రికెటర్ బీఎస్ చంద్రశేఖర్ అనారోగ్యానికి గురైయ్యారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. 75 ఏళ్ల చంద్రశేఖర్ మ్యాచ్‌ను చూస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
‘చంద్రశేఖర్ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. మ్యాచ్ చూస్తున్న సమయంలో అకస్మాతుగా అస్వస్థతకు గురయ్యారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు” అని చంద్రశేఖర్ భార్య సంధ్య తెలిపారు. అలాగే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసౌసియేషన్ అధికారి వినయ్ మృత్యుంజయ స్పందిస్తూ.. ‘చంద్రశేఖర్ ఐసీయూలో ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది’ అని వెల్లడించారు. ఎన్నో ఏళ్లు భారత జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా సేవలు అందించారు చంద్రశేఖర్. 58 టెస్టులు ఆడిన ఆయన 242 వికెట్లు పడగొట్టారు.