ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(MP Harbhajan Singh) కీలక నిర్ణయం తీసుకున్నాడు. రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని రైతు(Formers) పిల్లల చదువులు, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తానంటూ ప్రకటించాడు. దేశాభివృద్ధి కోసం తాను చేయగలిగినదంతా తప్పకుండా చేస్తానని హర్భజన్ భజ్జీ పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ కొంతకాలం క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) తరపున పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. హర్భజన్ సింగ్‌ను పంజాబ్ నుంచి ఎంపీగా చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో చాలా రచ్చ జరిగింది. రైతులకు బహిరంగంగా మద్దతు ఇవ్వని భజ్జీ.. రైతు ఉద్యమంలో పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జలంధర్ నివాసి అయిన హర్భజన్ సింగ్ బీజేపీలో చేరతాడంటూ గతంలో వార్తలు వినిపించాయి. పంజాబ్ ఎన్నికల్లో కూడా ఆయన్ను సీఎం చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే పంజాబ్‌లో పరిస్థితిని చూసి బీజేపీ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ భజ్జీని కలిశారు. దీంతో భజ్జీ కాంగ్రెస్‌లో చేరతారని అంతా ఊహించారు. అయితే, ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడలేదు. దీని తర్వాత అకస్మాత్తుగా అతను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. ఆప్ అతన్ని పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపించింది.
హర్భజన్ సింగ్ 1998లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. 2015లో శ్రీలంకతో చివరి టెస్టు ఆడాడు. అదే సమయంలో, భజ్జీ తన మొదటి ODI మ్యాచ్‌ని 1998లో న్యూజిలాండ్‌తో ఆడాడు. అతని చివరి వన్డే మ్యాచ్ 2015లో దక్షిణాఫ్రికాతో ఆడాడు. భజ్జీగా పేరుగాంచిన హర్భజన్ సింగ్ టీమిండియా తరఫున 103 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతని పేరిట 417 వికెట్లు ఉన్నాయి. వన్డేల్లో 236 మ్యాచుల్లో 269 వికెట్లు తీశాడు. టీ20లో భారత్ తరపున భజ్జీ 28 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 25 వికెట్లు తీశాడు. 2016లో హర్భజన్ ఆసియా కప్‌లో యూఏఈతో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇదే అతడికి చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా. ఐపీఎల్‌లో హర్భజన్ 163 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టాడు.
Also Read: IPL 2022: ఆ ప్లేయర్ ఐపీఎల్ ఆడకపోయినా 14 కోట్లు కచ్చితంగా చెల్లించాల్సిందే..!