IPL 2026 : వీళ్ల ఐపీఎల్ చరిత్ర ముగిసింది.. టోర్నీ నుంచి ఐదుగురు స్టార్ దిగ్గజాలు ఔట్

IPL 2026 : ఐపీఎల్ 2026 కోసం జోరుగా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈసారి టోర్నమెంట్ కు కొంతమంది దిగ్గజ ఆటగాళ్లు దూరం అయ్యారు. డిసెంబర్ 16 న అబుదాబిలో జరగబోయే మినీ వేలం దగ్గర పడుతున్న కొద్దీ, పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ సీజన్ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

IPL 2026 : వీళ్ల ఐపీఎల్ చరిత్ర ముగిసింది.. టోర్నీ నుంచి ఐదుగురు స్టార్ దిగ్గజాలు ఔట్
Andre Russell

Updated on: Dec 10, 2025 | 1:40 PM

IPL 2026 : ఐపీఎల్ 2026 కోసం జోరుగా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈసారి టోర్నమెంట్ కు కొంతమంది దిగ్గజ ఆటగాళ్లు దూరం అయ్యారు. డిసెంబర్ 16 న అబుదాబిలో జరగబోయే మినీ వేలం దగ్గర పడుతున్న కొద్దీ, పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ సీజన్ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరిలో కొంతమంది ఆటగాళ్లు ఇతర లీగ్‌లను ఎంచుకోగా మరికొందరు రిటైర్మెంట్ లేదా బ్రేక్ తీసుకునే మార్గాన్ని ఎంచుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ ఆటగాళ్ల నిర్ణయాలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి.

మోయిన్ అలీ : ఇంగ్లాండ్‌కు చెందిన సీనియర్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ ఐపీఎల్ 2026 లో ఆడకూడదని నిర్ణయించుకుని, బదులుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ వైపు మొగ్గు చూపారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన ఆయన గత సీజన్ అంతగా బాగా ఆడకపోయినా, మోయిన్ ఆల్‌రౌండ్ సామర్థ్యాలకు మంచి గుర్తింపు ఉంది. ఐపీఎల్‌లో 73 మ్యాచ్‌లు ఆడిన ఆయన 1167 పరుగులు చేసి, 41 వికెట్లు పడగొట్టారు.

ఫాఫ్ డు ప్లెసిస్ : దక్షిణాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డు ప్లెసిస్ కూడా పీఎస్‌ఎల్కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఐపీఎల్ తనకు సంవత్సరాలుగా గుర్తింపు మరియు గౌరవాన్ని ఇచ్చిందని, అయితే ఈ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా కష్టమైందని ఆయన సందేశంలో పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ జట్ల తరపున అద్భుతంగా రాణించిన ఫాఫ్, ఐపీఎల్‌లో మొత్తం 4773 పరుగులు చేసి, ఎప్పుడూ నమ్మదగిన బ్యాట్స్‌మన్‌గా ఉన్నారు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ : ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఎలాంటి కారణం చెప్పకుండానే ఐపీఎల్ 2026 వేలం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారు. గత రెండు సీజన్లలో ఆయన ప్రదర్శన చాలా పేలవంగా ఉంది, 15 ఇన్నింగ్స్‌లలో కేవలం 100 పరుగులు మాత్రమే చేయగలిగారు. అయితే, ఆయన ఐపీఎల్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో అత్యంత వినోదాత్మక విదేశీ ఆటగాళ్లలో ఒకరు.

ఆండ్రీ రస్సెల్ : కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన ఇకపై కేకేఆర్ కుటుంబంతో పవర్ కోచ్ గా కొనసాగుతానని చెప్పారు. రస్సెల్ ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్లలో ఒకరు. 140 మ్యాచ్‌లలో 2651 పరుగులు, 123 వికెట్లు – ఈ గణాంకాలు ఆయన పవర్ తెలియజేస్తాయి.

రవిచంద్రన్ అశ్విన్ : భారత దేశపు గొప్ప ఆఫ్-స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికారు. ఆగస్టు 2025 లో ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన, 187 వికెట్లతో ఐపీఎల్ చరిత్రలో టాప్-5 బౌలర్‌లలో ఒకరిగా ఉన్నారు. 2010, 2011 లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర టీ20 లీగ్‌లలో ఆడతానని ఆయన స్పష్టం చేశారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.