Cricket News: 66 బంతులు 94 నిమిషాలు కేవలం ఒక్క పరుగు.. 11వ నెంబర్ ఆటగాడి విశ్వరూపం..!

|

Apr 11, 2022 | 11:15 AM

Cricket News: ఒక క్రికెటర్‌కి ఫస్ట్‌ రన్ చేయడానికి సాధారణంగా ఎన్నిబంతులు అవసరమవుతాయి.. ఎంత సమయం పడుతుంది. మీ సమాధానం ఏదైనా కావొచ్చు. కానీ ఒక ప్లేయర్

Cricket News:  66 బంతులు 94 నిమిషాలు కేవలం ఒక్క పరుగు.. 11వ నెంబర్ ఆటగాడి విశ్వరూపం..!
County Championship
Follow us on

Cricket News: ఒక క్రికెటర్‌కి ఫస్ట్‌ రన్ చేయడానికి సాధారణంగా ఎన్నిబంతులు అవసరమవుతాయి.. ఎంత సమయం పడుతుంది. మీ సమాధానం ఏదైనా కావొచ్చు. కానీ ఒక ప్లేయర్ మొదటి రన్‌ కోసం ఏకంగా 94 నిమిషాల పాటు క్రీజులో ఉండి 66 బంతులు ఎదుర్కొని ఆ ఒక్క పరుగు చేశాడు. అంటే అతడు ఎంత జిడ్డుగా ఆడాడో అర్థమవుతుంది. ఈ ఆట సగటు క్రికెట్‌ అభిమానికి విసుగుపుట్టించవచ్చు. కానీ 11వ నెంబర్‌లో వచ్చి ఇలా ఆడి జట్టుని ఓటమి నుంచి కాపాడాడు. టస్ట్‌ క్రికెట్‌లో ఇది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌ అనే చెప్పాలి. ఎందుకంటే అసలైన క్రికెట్‌ అంటే టెస్ట్ ఆడటమే. ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సర్రే, వార్విక్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వార్విక్‌షైర్‌కు చెందిన 11వ నంబర్ బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవడానికి 94 నిమిషాల సమయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

వార్విక్‌షైర్ నంబర్ 11 బ్యాట్స్‌మెన్ ఒలివర్ హన్నన్ డాల్బీ సర్రేపై 134 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో అతను 89 బంతులు ఆడి 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సర్రేపై ఇద్దరు వార్విక్‌షైర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ లాంబ్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మైఖేల్ బర్గెస్ సెంచరీలు చేశారు. కానీ 11వ స్థానంలో వచ్చి ఆడిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఒలివర్ హన్నాన్ డాల్బీ ఆటని ఎవ్వరూ మరిచిపోలేరు. సర్రేతో జరిగిన వార్విక్‌షైర్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు ఈ జట్టు తన తదుపరి మ్యాచ్‌ని కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఏప్రిల్ 21న ఎసెక్స్‌తో ఆడాల్సి ఉంది.

TS Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెరిగేనా.. ఆశగా చూస్తున్న నిరుద్యోగులు..!

Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి..!

Indian Railways: రైలు టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్యని గమనించారా.. ఇందులో ఉండే సమాచారం ఏంటో తెలుసా..!