Mohammad Shami: తలపై పెట్టుకోవాల్సిన ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు పెడతావా? మార్ష్‌ తీరుపై షమీ ఆవేదన

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి బీరు తాగుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్లు మార్ష్‌ ప్రవర్తనపై మండిపడ్డారు. ఆసీస్ ఆటగాళ్లు ఏ మాత్రం మారలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకూడా మిచెల్‌ మార్ష్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు

Mohammad Shami: తలపై పెట్టుకోవాల్సిన ప్రపంచ కప్  ట్రోఫీపై కాళ్లు పెడతావా? మార్ష్‌ తీరుపై షమీ ఆవేదన
Mitchell Marsh, Mohammad Shami

Updated on: Nov 24, 2023 | 2:34 PM

అహ్మదాబాద్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు చాలామందికి విస్మయం కలిగించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి బీరు తాగుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్లు మార్ష్‌ ప్రవర్తనపై మండిపడ్డారు. ఆసీస్ ఆటగాళ్లు ఏ మాత్రం మారలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకూడా మిచెల్‌ మార్ష్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘ మిచెల్‌ మార్ష్‌ ప్రవర్తనను చూసి నేను బాధ పడ్డాను. ప్రపంచంలోని అన్ని జట్లు పోరాడే ట్రోఫీ ఇది. దీనిని ఆటగాళ్ల తమ తలపైన పెట్టుకోవాలి. అలాంటి ప్రతిష్ఠాత్మక ట్రోఫీపై కాళ్లు పెట్టడం నాకే మాత్రం సంతోషాన్ని కలిగించలేదు’ అని మహ్మద్ షమీ అసహనం వ్యక్తం చేశాడు.

మిచెల్‌ మార్ష్‌పై కేసు నమోదు..

కాగా మిచెల్‌ మార్ష్‌ ప్రవర్తించిన తీరుపై సగటు క్రికెట్‌ అభిమానులు కూడా మండిపడుతున్నారు. తాజాగా అతనిపై భారత్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్‌ కేశవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ గేట్‌ పోలీసులు మార్ష్‌పై కేసు నమోదు చేశారు. మార్ష్‌ ప్రపంచ కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టి అవమానించాడంతో పాటు 140 కోట్ల మంది మనో భావాలను గాయపరిచినట్లు కేశవ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇన్ని విమర్శలొస్తున్నా మార్ష్‌ మాత్రం స్పందించకపోవడం కొస మెరుపు.

ఇవి కూడా చదవండి

ప్రపంచ కప్ ట్రోఫీతో మిచెల్ మార్ష్

వరల్డ్ కప్ తో టీమిండియా క్రికెటర్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..