AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : మరోసారి మెస్సీ మ్యాజిక్.. కేప్ వెర్డేపై అర్జెంటీనా ఘనవిజయం.. ప్రీ-క్వార్టర్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో లియోనెల్ మెస్సీ గోల్‌తో మెరిసిన అర్జెంటీనా, కేప్ వెర్డేపై 3-2 తేడాతో ఉత్కంఠ విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు చేరింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో క్రిస్టియన్ రోమేరో గోల్ విజయం ఖాయం చేసింది.

FIFA World Cup 2026 : మరోసారి మెస్సీ మ్యాజిక్.. కేప్ వెర్డేపై అర్జెంటీనా ఘనవిజయం.. ప్రీ-క్వార్టర్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ
Fifa World Cup 2026
Rakesh
|

Updated on: Jul 04, 2026 | 1:23 PM

Share

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా నాకౌట్ గండం నుంచి గట్టెక్కింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా కేప్ వెర్డేతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో అత్యంత ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. మియామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆఖరి నిమిషం వరకు ప్రేక్షకులకు అసలైన ఫుట్‌బాల్ మజాను అందించింది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఆ తర్వాత మైదానంలో హైడ్రామా, గోల్స్ వర్షం కురిశాయి. చివరకు క్రిస్టియన్ రోమేరో కొట్టిన సూపర్‌ హెడర్ పుణ్యమా అని అర్జెంటీనా విజేతగా నిలిచి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ (రౌండ్ ఆఫ్ 16)లోకి అడుగుపెట్టింది.

మళ్లీ మెరిసిన మెస్సీ మ్యాజిక్

స్థానిక మియామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. మ్యాచ్ 29వ నిమిషంలో స్టేడియం ఒక్కసారిగా మెస్సీ నినాదాలతో మారుమోగిపోయింది. మిడ్‌ఫీల్డ్ నుంచి లిసాండ్రో మార్టినెజ్ అందించిన అద్భుతమైన లాంగ్ బాల్‌ను మెస్సీ తనదైన శైలిలో నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఆ వెంటనే ఎంతో కష్టతరమైన కోణం (డిఫికల్ట్ యాంగిల్) నుంచి తన ఎడమ కాలితో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఈ అద్భుతమైన గోల్‌తో అర్జెంటీనా మ్యాచ్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

డిఫెండింగ్ ఛాంపియన్లకు చుక్కలు చూపించిన కేప్ వెర్డే

అర్జెంటీనా లాంటి బలమైన జట్టు ఎదురుగా ఉన్నప్పటికీ కేప్ వెర్డే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నిరంతరం అర్జెంటీనా డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచుతూ సమాధానం కోసం వెతికింది. ఈ క్రమంలోనే మ్యాచ్ 59వ నిమిషంలో రైట్ ఫ్లాంక్ నుంచి ర్యాన్ మెండిస్ వేగంగా దూసుకువచ్చి డెరోయ్ డువార్టేకు ఒక సూపర్‌ క్రాస్ ఇచ్చాడు. ఆ బంతిని అందుకున్న డువార్టే ఎలాంటి పొరపాటు చేయకుండా అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమీ మార్టినెజ్ కాళ్ల మధ్య నుంచి బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత 90 నిమిషాల వరకు ఇరు జట్లు మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది.

ఎక్స్‌ట్రా టైమ్‌లో మైండ్‌బ్లోయింగ్ డ్రామా

ఎక్స్‌ట్రా టైమ్ ప్రారంభమైన వెంటనే మ్యాచ్ మళ్లీ ఊపందుకుంది. 92వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన కార్నర్ కిక్‌ను మెస్సీ తీసుకున్నాడు. పెనాల్టీ బాక్స్ వద్ద జరిగిన గందరగోళంలో బంతి లిసాండ్రో మార్టినెజ్ చేతికి చిక్కింది. అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పవర్‌ఫుల్ షాట్‌తో గోల్ కొట్టి అర్జెంటీనాను 2-1తో ముందంజలో నిలిపాడు. కానీ కేప్ వెర్డే పట్టుదలను తక్కువ అంచనా వేయలేమని మరోసారి నిరూపితమైంది. 103వ నిమిషంలో సిడ్నీ లోప్స్ కాబ్రల్ లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి, కుడికాలితో కొట్టిన కర్లింగ్ షాట్ నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో స్కోరు మళ్లీ 2-2తో సమమై మ్యాచ్ షూటౌట్ వైపు వెళ్తున్నట్లు అనిపించింది.

111వ నిమిషంలో రోమేరో హెడర్ వండర్

మ్యాచ్ మరో 9 నిమిషాల్లో ముగుస్తుందనగా 111వ నిమిషంలో అర్జెంటీనాకు మరో కీలకమైన కార్నర్ లభించింది. లియోనల్ మెస్సీ పెనాల్టీ బాక్స్ మధ్యలోకి బంతిని క్రాస్ చేయగా, అర్జెంటీనా డిఫెండర్ క్రిస్టియన్ రోమేరో గాల్లోకి ఎగిరి బుల్లెట్ లాంటి హెడర్ కొట్టాడు. ఆ బంతి కేప్ వెర్డే ఆటగాడు డిని బోర్గెస్‌కు తగిలి నేరుగా ఓన్ గోల్ (సెల్ఫ్ గోల్) రూపంలో నెట్‌లోకి వెళ్లిపోయింది. ఈ గోల్‌పై కాసేపు వీఏఆర్ రివ్యూ జరిగి టెన్షన్ పెంచినప్పటికీ, రెఫరీ చివరకు దానిని గోల్‌గా ప్రకటించడంతో అర్జెంటీనా 3-2తో ముందంజ వేసింది. మ్యాచ్ ముగిసేవరకు ఈ లీడ్ కొనసాగడంతో అర్జెంటీనా విజయం ఖాయమైంది.

ప్రీ-క్వార్టర్స్‌లో మహ్మద్ సలా ఈజిప్ట్‌తో అర్జెంటీనా ఢీ

ఈ అద్భుత విజయంతో రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన అర్జెంటీనా.. తదుపరి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా నేతృత్వంలోని ఈజిప్ట్ జట్టుతో తలపడనుంది. ఈజిప్ట్ జట్టు తన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి ఇక్కడి వరకు వచ్చింది. అట్లాంటా వేదికగా జరగబోయే ఈ మెగా పోరులో మెస్సీ వర్సెస్ సలా మధ్య జరిగే సమరం ఫుట్‌బాల్ అభిమానులకు కనువిందు చేయడం ఖాయం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Andhra Pradesh: బుధవారం ఎన్నికల షెడ్యూల్‌.. ఏపీలోని 28 జడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్ల ఖరారు
Andhra Pradesh: బుధవారం ఎన్నికల షెడ్యూల్‌.. ఏపీలోని 28 జడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్ల ఖరారు
ఆంధ్రా స్టైల్ మటన్ పచ్చడి.. కారం, మసాలాలతో అదిరిపోయే రుచి
ఆంధ్రా స్టైల్ మటన్ పచ్చడి.. కారం, మసాలాలతో అదిరిపోయే రుచి
తక్కువ మాట్లాడటం బలహీనత కాదు.. ఇలాంటి వారితో జాగ్రత్త
తక్కువ మాట్లాడటం బలహీనత కాదు.. ఇలాంటి వారితో జాగ్రత్త
కిడ్నీలపై ఒత్తిడి పెంచే ఈ 4 ఆహారాలు ఏవో తెలుసా?
కిడ్నీలపై ఒత్తిడి పెంచే ఈ 4 ఆహారాలు ఏవో తెలుసా?
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా