
MS Dhoni Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విరామంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు బయట చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో తరచూ కనిపించే వీడియోలే ఇందుకు నిదర్శనం. తాజాగా ధోనికి సంబంధించిన హృదయాన్ని కదిలించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియాలో ధోని చైర్‌లో కూర్చున్నట్లు చూడొచ్చు. ఆయన పక్కన ఒక మహిళా అభిమాని నిలబడి ఉంది. అలాగే మరికొంతమంది కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అయితే, ధోని మాట్లాడుతున్న క్రమంలో ఆ మహిళా అభిమాని మిస్టర్ కూల్ పాదాలను తాకింది. ఇది గమనించిన జార్ఖండ్ డైనమైట్ ఆమెతో కరచాలనం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. ఈ వీడియోతో పాటు ధోని పాదాలను తాకిన పలు వీడియోలు తెరపైకి వస్తున్నాయి. ఆయన అభిమానులు చాలా మంది ఇలా చేశారు. అలాగే, IPL 2023 ప్రారంభ వేడుకలో గాయకుడు అరిజిత్ సింగ్ కూడా ధోని పాదాలను తాకాడు.
ధోనీ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌ను 45 మిలియన్లకు పైగా ప్రజలు అనుసరిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో చివరి పోస్ట్‌ను పంచుకున్నాడు. ఇందులో తన పెంపుడు కుక్కలతో కలిసి కనిపించాడు. పుట్టినరోజు సందర్భంగా ధోని పెంపుడు కుక్కతో కలిసి కేక్ కట్ చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో వేల మంది కామెంట్లు కూడా చేశారు.
Mahi🫶❤️#MSDhoni pic.twitter.com/Y5Q6zYdypf
— Chakri Dhoni (@ChakriDhoni17) August 27, 2023
ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా ధోనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటుంది. ధోని కూతురు జివాకు కూడా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది.
How lucky is she 😭
— happy birthday Pradip ❤️ (@ItzSushma_) August 27, 2023
Really mahi is best men I’m really true love, one dream one selfie with mahi sir…💛💯🤟✍️
— Dayanand Rose (@dayanand_rose) August 27, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..