Bangladesh T20 World Cup squad: ఆ ఫాస్ట్ బౌలర్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. రిజర్వ్ బెంచ్‌కే పరిమితం.. 15 మందితో కూడిన జట్టు ప్రకటన

|

Sep 09, 2021 | 2:46 PM

అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్ రిజర్వ్‌ ప్లేయర్‌గా చేర్చడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్ కోసం జట్టులో ఉన్నా.. రూబెల్‌ను మాత్రం పరిగణించకపోవడం గమనార్హం.

Bangladesh T20 World Cup squad: ఆ ఫాస్ట్ బౌలర్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. రిజర్వ్ బెంచ్‌కే పరిమితం.. 15 మందితో కూడిన జట్టు ప్రకటన
Rubel Hossain
Follow us on

T20 World Cup: రాబోయే టీ 20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు ఆయా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న టీమిండియా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తాజాగా మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కూడా పొట్టి ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్టును గురువారం (సెప్టెంబర్ 9) ప్రకటించింది. అయితే ఈ జట్టులో అందరూ ఆశించినంతంగా మార్పులు చేయకపోవడం విశేషం. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్ రిజర్వ్‌ల స్థాయికి చేర్చడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్ కోసం జట్టులో ఉన్నా.. రూబెల్‌ను మాత్రం పరిగణించకపోవడం గమనార్హం. 31 ఏళ్ల ఫాస్ట్ బౌలర్, ఇప్పటివరకు 28 టీ 20 లు ఆడాడు. న్యూజిలాండ్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పొట్టి ఫార్మాట్‌లో చివరిసారిగా జాతీయ జట్టు తరపున పాల్గొన్నాడు.

మహ్మదుల్లా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై సిరీస్ విజయాలు సాధించిన బలమైన బృందానికి నాయకత్వం వహించనున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై సౌమ్య సర్కార్ పేలవమైన ప్రదర్శన ప్రభావం చూపలేదు. కారణం.. తమీమ్ ఇక్బాల్ అందుబాటులో లేకపోవడంతో అతను తన స్థానాన్ని భర్తీ చేసేందుకు సౌమ్య సర్కార్‌కు మరో ఛాన్స్ ఇచ్చారు. ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ ఆస్ట్రేలియాపై ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి నాలుగు మ్యాచుల్లో ఈ ఆటగాడు బరిలోకి దిగలేదు.

న్యూజిలాండ్‌తో ఆడటానికి ఎంపిక చేసిన 19 మంది సభ్యుల బృందాన్నే దాదాపుగా ఉంచారు. ఇందులో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే 19 మందిలో నలుగురు ఆటగాళ్లను తొలగించారు. రూబెల్ కాకుండా, మోసాద్దెక్ హోస్సేన్, తైజుల్ ఇస్లాం, అమీనుల్ ఇస్లాం త్రయాన్ని టీ20 స్వార్డ్‌ నుంచి తప్పించారు. అయితే, ఇప్పటివరకు ఏడు టీ 20 లు ఆడిన లెగ్‌స్పిన్నర్ అమీనుల్ రూబెల్‌తో పాటు స్టాండ్‌బై ప్లేయర్‌లలో ఒకరిగా చోటు సంపాధించాడు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత మొహమ్మద్ మిథున్‌ను కూడా లెక్కలోకి తీసుకోలేదు.

బంగ్లాదేశ్.. ఒమన్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌లతో పాటు గ్రూప్ బీలో ఉంది. తమ గ్రూప్‌లో మొదటి రెండు స్థానాలు సాధించిన టీంలే సూపర్ 12 దశకు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 17 న స్కాట్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లా టీం తలపడనుంది. ఈ మ్యాచ్‌తోనే టోర్నమెంట్ ప్రారంభంకానుంది.

స్క్వాడ్: మహ్మదుల్లా (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, సౌమ్య సర్కార్, లిటన్ కుమార్ దాస్, అఫిఫ్ హుస్సేన్, మహ్మద్ నయీమ్, నూరుల్ హసన్ సోహన్, షమీమ్ హుస్సేన్, ముస్తఫిజుర్ రహమాన్, తస్కిన్ అహ్మద్, మహ్మద్ సైఫుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం, మహేది హసన్ నాస్ అహ్మద్

రిజర్వ్‌ ప్లేయర్లు: అమీనుల్ ఇస్లాం, రూబెల్ హుస్సేన్

Also Read:

T20 World Cup 2021: భావోద్వేగానికి గురైన ముంబై ప్లేయర్.. ఏడుస్తూ హార్దిక్‌కు హగ్ ఇచ్చిన ఇషాన్ కిషన్

Cricket Australia: తాలిబన్లకు క్రికెట్ ఆస్ట్రేలియా స్ట్రాంగ్ వార్నింగ్.. వారి స్వేచ్చకు భంగం కలిగిస్తే ఊరుకోం..!