Farokh Engineer Coments : అనుష్కలాంటి అందమైన భార్య ఉండగా, ఎలా నిరాశకు లోనయ్యావని కోహ్లీని ప్రశ్నించాడు టీమిండియా మాజీ ప్లేయర్ ఫరూక్ ఇంజనీర్. 2014లో కుంగుబాటుకు గురయ్యానని ఇటీవల విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు స్పందించిన ఫరూర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు.
‘అంత అందమైన భార్య ఉండగా కుంగుబాటుకు ఎలా గురయ్యావు? ఇప్పుడు కోహ్లీకి పాప కూడా జన్మించింది. ఆ భగవంతుడికి రుణపడి ఉండాలి. అయితే, కుంగుబాటు అనేది పాశ్చాత్య దేశాల్లో ఉంటుంది. వాళ్లే దాని గురించి ఎక్కువగా మాట్లాడతారు. మన మెదడు ఎలా పనిచేస్తుందో ఎప్పటికి తెలియదు. మన భారతీయులకు కష్టాలను ఎదుర్కొనే శక్తి అధికంగా ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడే మానసిక స్థైర్యం మనకు ఉంటుంది’ అని ఫరూక్ చెప్పుకొచ్చాడు. అయితే, ఇక్కడే మాజీ క్రికెటర్ తప్పులో కాలేశాడు. విరాట్.. అనుష్కను వివాహమాడింది 2017 డిసెంబర్ 11న. అంటే 2014లో కోహ్లీ ఒంటరిగానే ఉన్నాడు.
ఇక 2014లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో పది ఇన్నింగ్సుల్లో 13.50 అత్యల్ప సగటు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఆ పర్యటన తర్వాత డిప్రెషన్‌కు లోనైనట్లు విరాట్ ఇటీవల చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ప్రపంచంలో తాన్కొడే ఉన్నట్లు భావించానని వివరించాడు. అప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సలహాలు తీసుకున్నట్లు చెప్పాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్ ఆడుతున్న భారత్ సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మార్చి 4 నుంచి ఇరు జట్ల మధ్యా నాలుగో టెస్టు జరగనుంది. భారత్ ఇది గెలిస్తే సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇందుకోసం ఆటగాళ్లందరు సన్నద్ధం అవుతున్నారు. కచ్చితంగా గెలిచి ఫైనల్‌కు అర్హత సాధిస్తామని ధీమాగా ఉన్నారు.
క్రికెట్‌లో ఆ షాట్‌ను రద్దు చేయాలి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..